లోకసభ ఎన్నికలు: తెలంగాణ కీలకం, లబ్ధి ఎవరికి?

'Telangana' is the key to Lok Sabha elections
హైదరాబాద్: వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలుగు ప్రాంతాల్లో తెలంగాణ అంశమే కీలకం కానుంది. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెసు పార్టీ ఈసారి తెలంగాణ ప్రాంతంలో పాగా వేయడానికి రాష్ట్ర విభజనను చేపట్టిందనే విమర్శలు వస్తున్నాయి. విభజన వల్ల తమ పార్టీ ప్రయోజనం పొందుతుందనే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం తన పార్లమెంటు సభ్యుల నుంచి, శాసనసభ్యుల నుంచి తిరుగుబాటును ఎదుర్కుంటోంది. ఈ స్థితిలో సీమాంధ్రలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందనే అంచనాలు సాగుతున్నాయి. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎటు వైపు వెళ్తారనే విషయంపై కూడా కాంగ్రెసు భవిష్యత్తు ఆధారపడి ఉండవచ్చు.

సీమాంధ్రలో తాము తుడిచిపెట్టుకుపోతామని భావించిన కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి అత్యధిక స్థానాలు సాధించే ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే అది సాధ్యమవుతుందనే ఆంచనాలో కాంగ్రెసు అధిష్టానం ఉంది.

దక్షిణ భారతదేశంలో అత్యధిక పార్లమెంటు సీట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 42 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో 25 సీమాంధ్రలో ఉండగా, 17 తెలంగాణలో ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యులు, లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలి, తిరుగుబాటు సీమాంధ్రలో గాలి ఎటు వైపు వీస్తున్నదని చెప్పడానికి సంకేతాలుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+