చంద్రబాబుపై తెలంగాణ లాయర్ల ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అడ్వొకేట్స్ జెఏసి శనివారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మహానాడు వేదికగా చంద్రబాబు ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారని ఫిర్యాదులో ఆరోపించారు. యాక్టు 1951 ప్రకారం ప్రజా ప్రతినిధులను అవమానపర్చిన చంద్రబాబునాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బాబుకు అంత సీన్ లేదు: గట్టు

హామీలు నెరవేర్చే సత్తా లేకనే ఏపి సిఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో మహానాడు పెట్టాడని టిఆర్‌ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఖబడ్దార్ అనేంత సీన్ చంద్రబాబుకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ అని, చంద్రబాబులో ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాలు ఒక్కటి లేవని విమర్శించారు. టిడిపిలో మిగిలింది ఒక్కరో ఇద్దరో కార్యకర్తలని అన్నారు.
ఏపీలో చంద్రబాబు అరాచకవాదిగా మారాడని, రాజకీయాల్లో చంద్రబాబు లాంటి అరాచకవాది ఉండొద్దని ఎన్టీఆర్ ఆనాడు ఆశించాడని అన్నారు. తెలంగాణలో ప్రతీ రైతుకు రుణమాఫీ జరిగిందని... ఆంధ్రాలో మాత్రం అలా జరగలేదన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications