కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై టీ లాయర్ల ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై కేసు పెట్టాలని తెలంగాణ అడ్వకేట్స్ జెఎసి డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన లోకేష్‌పై కేసులు పెట్టాలంటూ తెలంగాణ అడ్వకేట్ జెఎసి నాయకులు గోవర్దన్‌రెడ్డి, ఉపేంద్ర, గోవర్దన్‌లు ఆదివారం హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ట్రస్ట్ భవన్‌లో లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కెసిఆర్ ఆరు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమిలేదని, పోలీసులకు కొత్తకార్లు, ఆయన కాన్వాయ్ కలర్ మార్చుకున్నారని ఇష్టానుసారంగా మాట్లాడరని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడిప్పుడే ఇరు ప్రాంతాల మధ్య సయోద్య నెలకొంటున సమయంలో లోకేష్ లాంటి వారి వల్ల విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, వెంటనే ఆయనపై ఐపిసి 153ఎ, 295, 504, 505 రెడ్ విత్ 34ల కింద కేసులు పెట్టాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. పోలీసులకు కొత్త కార్లు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని నారా లోకేష్ అన్నారు.
న్యాయ సలహా తీసుకుని నారా లోకేష్‌పై కేసు నమోదుపై నిర్ణయం తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications