టిపై డిగ్గీ: కిరణ్ కుమార్‌ను తొలగించాలని నేతల ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణలోని, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సీమాంధ్ర ప్రాంతవాసుల భద్రత కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని, కాంగ్రెసు పార్టీ ఓసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం సూచించారు. హైదరాబాదు అంశంలో రక్షణపరమైన వ్యవహారాలు మినహా అన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాకనే తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తుది నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందన్నారు. మొదట తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాయన్నారు.

కిరణ్ పైన ఫిర్యాదు
తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ్యులు గాంధీ భవన్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై వారు డిగ్గీకి ఫిర్యాదు చేశారు. సిఎం ఉద్దేశ్యపూర్వకంగా శాసన సభకు బిల్లు రాకుండా చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చండి లేదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలా చూడాలని వారు కోరారు. అంతకుముందు వారు మంత్రి డికె అరుణ నివాసంలో బేటీ అయ్యారు. భేటీలో దామోదర రాజనర్సింహ, డి శ్రీనివాస్, శ్రీధర్ బాబు, జానా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిరణ్‌తో తాడోపేడో
ముఖ్యమంత్రితో తెలంగాణ ప్రాంత నేతలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాదుకు వచ్చిన బిల్లును చర్చకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆయనతో సై అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... కిరణ్ పైన తమకు నమ్మకం కోల్పోయిందని, బిల్లుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, తక్షణమే సిఎల్పీ సమావేశపరిస్తే తమకు కిరణ్ పైన నమ్మకం లేదని చెబుతామన్నారు.
ఎపిఎన్జీవోల అరెస్ట్
దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో ఉన్న నేపథ్యంలో ముట్టడికి వెళ్లబోతున్న ఎపిఎన్జీవోలను పోలీసులు అబిడ్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications