జెసిపై టి నేతల భగ్గు, పార్టీకి వ్యతిరేకం కాదని లగడపాటి

 Telangana leaders fires at JC
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంగళవారం భగ్గుమన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని అన్నందుకు జెసి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన నోటీకి భగవంతుడు ఏం చేస్తారో తెలియదని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు అన్నారు. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సోనియా పైన జెసి వ్యాఖ్యలు జీర్ణించుకోలేనివని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం పాటుపడుతున్న కాంగ్రెసు పార్టీ అధికారం కోసం ఎప్పుడు పాకులాడలేదన్నారు. పార్టీలో కాంట్రాక్టర్లకు, ఫ్యూడల్ మనస్కులకు చోటు ఉండవద్దన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై తీర్మానం ఉండదని, అభిప్రాయం మాత్రమే చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్న ఎంపీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మరికొందరు ధ్వజమెత్తారు.

టిక్కెట్ ఇవ్వకున్నా పర్లేదు: లగడపాటి

2014 ఎన్నికలలో తనకు కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇవ్వకున్నా అభ్యంతరం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ న్యూఢిల్లీలో అన్నారు. తన నియోజకవర్గం నుండి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారిని తాను గెలిపిస్తానని చెప్పారు.

యూపిఏ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. తాను యూపిఏకు వ్యతిరేకమని, కాంగ్రెసు పార్టీకి కాదన్నారు. యూపిఏ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సంఖ్యాబలం అంశాన్ని పక్కన పెడితే యూపిఏ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రభుత్వం దిగిపోయేందుకు ఇది సరైన సమయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+