సోనియా టీ అమ్మ: గౌడ్‌తో కెసిఆర్ ఆలింగనం (పిక్చర్స్)

హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో ఎగిరి గంతేస్తున్న తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ జెఎసి నాయకులు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ జెఎసి నాయకులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

సోనియాను తెలంగాణ అమ్మగా తెలంగాణ జెఎసి నాయకులు అభివర్ణించారు. తనను దేవతను చేయవద్దని సోనియా గాంధీ వారి ప్రశంసలను తట్టుకోలేక అన్నారు. సోనియాకే తెలంగాణ ఇచ్చిన ఘనత దక్కుతుందని వారన్నారు. కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ నాయకులు సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకుగాను కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సోనియాను కోదండరామ్ అభినందించారు. ఇది కీలకమైన నిర్ణయమని తనకు కూడా తెలుసునని ఆమె అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాల కంటే కూడా ఇదే గొప్ప నిర్ణయమని, దేశంలో ప్రజాస్వామీకరణకు ఇది దోహదం చేస్తుందని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తామూ భాగం అవుతామనగా, సోనియా అంగీకారంగా తలూపారు.

'తెలంగాణ ప్రజలకు మీరే దేవత' అని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు అన్నారు. ఆయనను ఆమె వారించారు. 'లేదు..లేదు. నన్ను దేవతను చేయొద్దు' అన్నారు. 'అలా అయితే మీరు మా అమ్మ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీరే మా అమ్మ' అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.

జైపాల్ రెడ్డి పెద్ద దిక్కు..

జైపాల్ రెడ్డి పెద్ద దిక్కు..

తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఢిల్లీలో అందరికీ పెద్ద దిక్కుగా మారారు. తెలంగాణ జెఎసి నేతలు ఆయనను కలిశారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో జెఎసి నేతలు..

రాజ్‌నాథ్ సింగ్‌తో జెఎసి నేతలు..

బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను తెలంగాణ జెఎసి నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. తాము తెలంగాణ వైపున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సుష్మా స్వరాజ్‌తో జెఎసి నేతలు..

సుష్మా స్వరాజ్‌తో జెఎసి నేతలు..

లోకసభలోబిజెపి పక్ష నేత సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ జెఎసి నాయకులు కలిశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు అనుసరించిన వైఖరిని సుష్మా తప్పు పట్టారు.

శ్రీనివాస్ గౌడ్‌కు కెసిఆర్ ఆలింగనం

శ్రీనివాస్ గౌడ్‌కు కెసిఆర్ ఆలింగనం

తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్‌ను ఆలింగనం చేసుకున్నారు.

కెసిఆర్‌తో కోదండరామ్...

కెసిఆర్‌తో కోదండరామ్...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయిన స్థితిలో కెసిఆర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇలా.

పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలా..

పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలా..

తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంతో పొంగులేటి సుధాకర్ రెడ్డి సోనియా గాంధీకి శ్రీవెంకటేశ్వర స్వామి, షిర్డీ సాయిబాబా ఫొటో ఫ్రేమ్‌లను బహూకరించారు.

కాంగ్రెసు నేతల సందడి

కాంగ్రెసు నేతల సందడి

తెలంగాణ కాంగ్రెసు నాయకులు శుక్రవారం సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారంనాడు వారు భేటీలతో గడిపారు.

జానా రెడ్డి ఇలా..

జానా రెడ్డి ఇలా..

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు తొలుత శుక్రవారంనాడు వి. హనుమంతరావు నివాసంలో సమావేశమయ్యారు. స్వీట్లు తినిపించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+