టీ మండలి: బాబు హెరిటేజ్ టార్గెట్! ఐటీఐఆర్‌పై కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ అంశం చర్చకు వచ్చింది. హెరిటేజ్ పాలలో యాక్సీటోన్ వాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మండలిలో అన్నారు.
మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచేందుకు యాక్సీటోన్ ఇంజెక్షన్లు పలువురు వాడుతున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయన్నారు. హెరిటేజ్ కూడా వాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయన్నారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధించారని చెప్పారు. హెరిటేజ్ పాలన పైన వెంటనే కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని యాదవ రెడ్డి అన్నారు.
సింథటిక్ పాల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ వేసి చర్యలు తీసుకోవాలన్నారు. హెరిటేజ్ పాలన పైన విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ ప్రభాకర రావు డిమాండ్ చేశారు. యాక్సీటోన్ వాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయని భూపాల్ రెడ్డి తదితర ఎమ్మెల్సీలు అన్నారు.

ఐటీఐఆర్ పైన కేటీఆర్
ఐటీఐఆర్ అమలులోకి వస్తే యాభై లక్షల నుండి లక్ష వరకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో అన్నారు. ఐటీ సహా అన్ని పరిశ్రమలను ఇంజనీరింగ్ కళాశాలలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఐటీఐఆర్‌ను ప్రతి జిల్లాకు అనుసంధానం చేస్తామని చెప్పారు.
హెచ్ఎండీఏతో కలిసి దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సహా అన్ని కళాశాలలకు అనుసంధానం చేస్తామన్నారు. ఐటీఐఆర్ అమలైతే ఉత్పత్తులు రెండు లక్షల ముప్పై అయిదువేల కోట్లకు పెరుగుతాయన్నారు. ఒక సీఈవోను నియమించి పరిశ్రమలు, కళాశాలలను అనుసంధానం చేస్తామని చెప్పారు.
500 మందికి పైగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి దానిని తీసుకు వస్తామన్నారు. హైదరాబాదు నలువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఉప్పల్, మాదాపుర్, శంషాబాద్‌లలో క్లస్టర్స్ అభివృద్ధి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications