శ్రీరాములు విగ్రహంపై పోస్టర్ కలకలం, వైయస్‌ది ధ్వంసం

అవతరణ దినోత్సవాన్ని అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు గైర్హాజరయ్యారు.
సీమాంధ్ర జిల్లాల్లో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. విభజన జరగదని కొందరు, విభజన జరుగుతుందనే ఆవేదనను ఇంకొందరు వ్యక్తం చేశారు. సమైక్యంగానే రాష్ట్రం ఉండాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ జిల్లాల్లో అవతరణ దినోత్సవాలను బహిష్కరించారు. నవంబర్ 1ని నిరసిస్తూ జిల్లాల్లో నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పురపాలక సంఘంపై నల్ల జెండాను ఉంచారు. పాల్వంచ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్ కలకలం రేపుతోంది.
'నేను వేర్పాటు వాదిని. మద్రాసు నుండి ఆంధ్రాను వేరు చేయమన్నాను. తెలంగాణను సీమాంధ్రలో కలపమని చెప్పలేదు' అని అందులో ఉంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారు పైన గల వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications