గవర్నర్‌నే అడగండి: జానారెడ్డి, టీ మంత్రుల భేటీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. శాసనసభను ప్రోరోగ్ చేయవద్దని కోరుతూ వారు ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే శాసనసభను సమావేశపరచడంలో జాప్యం జరగకుండా చూడాలని తాము గవర్నర్‌ను కోరినట్లు భేటీ అనంతరం జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తెలంగాణ బిల్లు వచ్చిన వెంటనే జాప్యం జరగకండా శాసనసభా సమావేశాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. దాని అవసరం గురించి చెప్పామని, జివోఎంతో సమన్వయం జరిగేలా చూడాలని కూడా కోరామని ఆయన అన్నారు. గవర్నర్ ఏమన్నారని మీడియా ప్రతినిధులు అడిగితే - ఏమన్నారో ఆయననే అడగండి అని జానా రెడ్డి సమాధానం ఇచ్చారు.

శాసనసభను ప్రోరోగ్ చేయవద్దని కోరుతూ తాను ఇది వరకే గవర్నర్‌కు లేఖ రాసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. గవర్నర్‌ను కలిసినవారిలో జానారెడ్డి, దామోదర రాజనర్సింహలతో పాటు జె గీతారెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
శాసనసభను ప్రోరోగ్ చేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం కొద్ది రోజుల క్రితం శాసనసభ సచివాలయ కార్యదర్శికి లేఖ రాసింది. తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తే జాప్యం చేయడానికి వీలుగానే ముఖ్యమంత్రి ప్రోరోగ్‌కు సిఫార్సు చేశారంటూ ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications