వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చానెళ్ల బ్యాన్: కేంద్రానికి ఎదురు తిరిగిన ఎంఎస్‌వోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ ఇచ్చిన నోటీసులకు తెలంగాణలోని ఎంఎస్‌వోలు ఎదురు తిరగడానికే నిర్ణయించుకున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాల్సిన ట్రాయ్ తమకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని ఎంఎస్‌వోల సంఘం నాయకులు అన్నారు. ప్రైవేట్ చానెళ్ల ప్రసారాల కోసం కేంద్రం తమపై ఒత్తిడి తెస్తోందని వారు విరమ్శఇంచారు.

ప్రజలు కోరుకున్న చానెళ్లను మాత్రమే తాము ప్రసారం చేస్తామని, ఇప్పుడు సాంకేతికత 105 చానెళ్లను మాత్రమే ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తోందని వారన్నారు. డిటిహెచ్ వాళ్లు తమకు నచ్చిన చానెళ్లను మాత్రమే ప్రసారం చేస్తుంటే మాట్లాడని కేంద్రం రెండు ప్రైవేట్ చానెళ్ల కోసం తమపై ఒత్తిడి తెస్తోందని వారన్నారు.

ఎవరో బెదిరిస్తే తాము బెదిరేది లేదని వారు స్పష్టం చేశఆరు. తాము ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. తాము కేంద్ర ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రజాప్రతినిధుల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి తమపై ఒత్తిడి తెస్తుందనే అనుమానాలు వస్తున్నాయని వారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తిసిన చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తే తమకు ట్రాయ్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

Telangana MSOs deplores TRAI attitude

రెండు టీవీ చానెళ్ల యాజమాన్యాలు క్యారేజీ ఫీజులు చెల్లించకుండా తమను బెదిరించడం సరి కాదని వారన్నారు. తాము చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజలు సహకరించాలని వారు కోరారు. కొన్ని విషయాలపై తమకు ఆంధ్ర చానెళ్లు సహకరించడం లేదని వారన్నారు. సెక్షన్ 19 ప్రకారం ఆ రెండు చానెళ్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తాము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేనది వారన్నారు. ఆంధ్ర పెత్తందార్ల ఆధిపత్యం ఇంకా పోలేదని వారన్నారు. ఆ రెండు చానెళ్ల ప్రసారాలు ఎందుకు రావడం లేదో ప్రజలకు తెలియాలని వారన్నారు.

English summary
Telangana MSOs'association deplored the TRAI act serving notice for banning TV9 and Andhrajyothi news channels in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X