పులిచింతల ప్రాజెక్టుకు తెలంగాణ కొర్రీ: వద్దంటూ ఎపికి లేఖ
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీపై వివాదం కొలిక్కి రాకుండానే మరో వివాదం ముందుకు వచ్చింది. కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. సహాయ పునరావాస చర్యలు పూర్తయ్యేంత వరకు పులిచింతల ప్రాజెక్టు నింపవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది.
ఆంధ్రలో నిర్మించే పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణలో పలు గ్రామాలు ముంపునకు గురువుతున్న విషయం తెలిసిందే. ఈ ముంపు గ్రామాలకు ఇంకా సహాయ పునరావాస చర్యలు పూర్తి స్థాయిలో అందలేదు. సహాయ పునరావాస పనులు మందకొడిగా సాగుతున్నాయి. ముంపు బాధితుల్లో మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందినవారు. 45 టిఎంసి నీటి సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనివల్ల 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెల్లటూరు, కిష్టాపురం, చింతరియాల, నెమలిపురి, రెబల్లె, శోభనాద్రపురం, సుల్తాన్‌పూర్ తండా, మట్టపల్లి, గుండ్లపల్లి, గుండెబోయిన గూడెం, తమ్మవరం, పీక్లానాయక్ తండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో సహాయ పునరావాస పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

సహాయ పునరావాస కార్యక్రమాలకు 115 కోట్లు విడుదల చేయాలని కోరుతూ నిరుడు ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్ఱభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ అధికారులు అంటున్నారు. డాక్టర్ కెఎల్ రావు సాగర్ ప్రాజెక్టు పులిచింతల సహాయ పునరావాస పనులు పూర్తికానంత వరకు ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నీటిని నింపవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలోని ఎత్తి పోతల పథకాలను సురక్షిత ప్రదేశాలకు తరలించేంత వరకూ పులిచింతలను ఈ ఏడాది పూర్తి సామర్థ్యంతో నీటిని నింపడానికి అనుమతించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications