వైఎస్ జగన్..లేటెస్ట్ సెన్సేషన్! దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి పాట

అమరావతి: బిత్తిరి సత్తి. రెగ్యులర్ గా టీవీ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. విభిన్న హావాభావాలు, విచిత్రమైన గెటప్ తో కనిపిస్తూ, తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ తరచూ కనిపించే కళాకారుడు బిత్తిరి సత్తి ఆలియాస్ రవి. తీన్మార్ వార్తల యాంకర్ గా కనిపించే బిత్తిరి సత్తిలో మంచి నటుడే కాదు.. అంతకుమించిన మంచి గాయకుడు కూడా ఉన్నారని నిరూపించే పాట ఇది. తాజాగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాసిన ఓ గీతం కోసం బిత్తిరి సత్తి తన గొంతును సవరించుకున్నారు. గీతాన్ని ఆలపించారు. ఇప్పుడా పాట లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది.

సీమాంధ్రకు తొలిసారి..

సీమాంధ్రకు తొలిసారి..

వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తోన్న `రావాలి జగన్, కావాలి జగన్` అనే పాట ఏ స్థాయిలో జనాదరణ పొందినదో మనకు తెలుసు. యూట్యూబ్ లో కోటి 10 లక్షల మంది ఈ పాటను చూశారు. ఓ రాజకీయ ప్రాంతీయ పార్టీ తన ఎన్నికల ప్రచారం కోసం రూపొందించుకున్న పాట యూట్యూబ్ లో ఇంతమంది చూడటం ఇదే తొలిసారి. తాజాగా బిత్తిరి సత్తి పాడిన పాట కూడా అదే స్థాయిలో హిట్ అయింది. బిత్తిరి సత్తి పాటలు పాడటం కొత్తేమీ కాదు. ఇది వరకు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఓ పాటను ఆలపించారాయన. అలాగే- ప్రేమికుల పైనా ఓ పాటను పాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన గీతాన్ని ఆలపించడం మాత్రం ఇదే తొలిసారి.

సొంత యూట్యూబ్ ఛానల్ లో..

సొంత యూట్యూబ్ ఛానల్ లో..

రాజన్న బిడ్డ అదిగో.. వస్తున్నాడు చూడరా.. అచ్చం రాజన్నలా నేడే.. అంటూ సాగుతుంది ఈ పాట. లేటెస్ట్ గా యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో చోటు సంపాదించింది. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఆ పాటను విడుదల చేశారు. మధ్యమధ్యలో కాస్త తెలంగాణ యాసను ఉపయోగించి, వైవిధ్యభరితంగా ఆలపించారు. వైఎస్ 3,648 కిలోమీటర్ల పాదయాత్రలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఈ గీతానికి బ్యాక్ డ్రాప్ గా చూపించారు. కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా దీనికోసం వినియోగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన విజువల్స్ ను కూడా ఈ పాటలో పొందుపరిచారు. రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట తరహాలోనే వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు దీన్ని ఇంటర్ నెట్ లో వైరల్ చేస్తున్నారు.

ఆల్బమ్ రూపొందించే పనిలో..?

ఆల్బమ్ రూపొందించే పనిలో..?

దీనితోపాటు- జగన్ పాదయాత్ర ఘట్టంపై ఓ ఆల్బమ్ ను కూడా రూపొందించాలనే ఆలోచనలో బిత్తిరి సత్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన అయిదు పాటలను ఓ సినీ గేయ రచయితను సంప్రదించినట్లు చెబుతున్నారు. నవరత్నాల పేరుతో వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలోని కొన్ని ప్రధాన అంశాలను తీసుకుని ఆయా పాటలను రాయించే పనిలో పడ్డట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ఈ ఆల్బమ్ ను మార్కెట్ లోకి తీసుకుని రావాలని బిత్తిరి సత్తి భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఆల్బమ్ పై మరిన్ని విషయాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+