కిరణ్ చెప్తే లైట్ తీసుకున్నారు కానీ అవే చెప్పారు: గంటా

ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడో ఒక చోట విభజన ప్రక్రియ ఆగటం ఖాయమన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రబ్బర్ స్టాంప్ కాదని, విభజనకు అడ్డుపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పైన కూడా నమ్మకముందన్నారు.
సభాపతి నాదెండ్ల మనోహర్ పైన అవిశ్వాస పెట్టే ఆలోచన తమకు లేదన్నారు. అవిశ్వాసం కేవలం అపోహ మాత్రమేనన్నారు. తాము స్పీకర్‌ను తప్పు పట్టడం లేదన్నారు. నిబంధనల ప్రకారమే అసెంబ్లీ ప్రోరోగ్ అవుతుందని చెప్పారు. ఐబి చీఫ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల పైన ముఖ్యమంత్రి చెప్పిందే నిజమైందన్నారు.
కేంద్రం తీరు తమకు ఏమాత్రం అర్థం కావడం లేదని, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా విభజన జరుపుతామని చెప్పడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications