హరిత తెలంగాణ: కెటిఆర్, సోలార్ వెలుగులు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణను హరిత హారంగా మార్చాలన్న లక్ష్యానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. గురువారం మాదాపూర్ హెచ్ఐసిసి సిఐఐ, ఐజిబిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2014 సదస్సు, ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ చొరవ తీసుకుని రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని 124 ఐటి సంస్థల్లో రెట్రో ఫిట్టింగ్, ఇంధన పొదుపు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. తెలంగాణలో కరెంటు లోటును అధిగమించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ పార్క్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి సోలార్ పార్క్ అని తెలిపారు.
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచాలని సిఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగా వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరిట 230 కోట్ల మొక్కలను నాటాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఐఐ, ఐజిబిసి వారు 100 గ్రీన్ స్కూల్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలనేది సిఎం కెసిఆర్ ఆకాంక్ష అని, నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా మంజూరు చేసే కొత్త ఇళ్లను గ్రీన్ కాన్సెప్ట్‌తోనే నిర్మిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా గ్రీన్ స్కూల్స్ రేటింగ్ సిస్టమ్, ఐజిబిసి ఆన్‌లైన్ సర్వీసెస్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. గ్రీన్ ఐ కాంటెస్ట్, గ్రీన్ డిజైన్ కాంపిటీషన్‌లలో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తులను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ ఎండి మంగుసింగ్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రేమ్ సి జైన్, సిఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రఘుపతి, సిఐఐ వైస్ ఛైర్మన్ వనితా దాట్ల పాల్గొన్నారు.

కెటిఆర్
తెలంగాణను హరిత హారంగా మార్చాలన్న లక్ష్యానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

కెటిఆర్
గురువారం మాదాపూర్ హెచ్ఐసిసి సిఐఐ, ఐజిబిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2014 సదస్సు, ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కెటిఆర్
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ చొరవ తీసుకుని రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

కెటిఆర్
హైదరాబాద్ నగరంలోని 124 ఐటి సంస్థల్లో రెట్రో ఫిట్టింగ్, ఇంధన పొదుపు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని చెప్పారు.

కెటిఆర్
తెలంగాణలో కరెంటు లోటును అధిగమించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ పార్క్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి సోలార్ పార్క్ అని తెలిపారు.

కెటిఆర్
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచాలని సిఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగా వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరిట 230 కోట్ల మొక్కలను నాటాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు.

కెటిఆర్
కార్యక్రమంలో భాగంగా గ్రీన్ స్కూల్స్ రేటింగ్ సిస్టమ్, ఐజిబిసి ఆన్‌లైన్ సర్వీసెస్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

కెటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో సిఐఐ, ఐజిబిసి వారు 100 గ్రీన్ స్కూల్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

కెటిఆర్
అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తులను మంత్రి కెటిఆర్ పరిశీలించారు.

కెటిఆర్
హైదరాబాద్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలనేది సిఎం కెసిఆర్ ఆకాంక్ష అని, నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా మంజూరు చేసే కొత్త ఇళ్లను గ్రీన్ కాన్సెప్ట్‌తోనే నిర్మిస్తామని తెలిపారు.

కెటిఆర్
గ్రీన్ ఐ కాంటెస్ట్, గ్రీన్ డిజైన్ కాంపిటీషన్‌లలో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు.

కెటిఆర్
కార్యక్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ ఎండి మంగుసింగ్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రేమ్ సి జైన్, సిఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రఘుపతి, సిఐఐ వైస్ ఛైర్మన్ వనితా దాట్ల పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications