వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు టు రాములమ్మ, కెసిఆర్ నో హ్యాపీ: ఎవరేమన్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పది జిల్లాల తెలంగాణకు కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణలోని పది జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని అంటగా, సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు అంటుకున్నాయి. నిర్ణయంపై తెలంగాణ ప్రాంత నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే తెరాస, బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తూనే బిల్లు పెట్టి ఆమోదమయ్యాకే సంబరాలు అంటున్నారు. సీమాంధ్ర నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

Telangana with Ten districts

ఏవరేమన్నారు?

జివోఎం ఇష్టానుసారంగా రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్ని మార్చేస్తోంది. విభజనపై కాంగ్రెసు పార్టీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమే ఇన్ని గందరగోళాలకు కారణమైంది. - ట్విట్టర్‌లో చంద్రబాబు

మోసపోయాం. కేబినెట్ నిర్ణయం నిరాశకు, దిగ్భ్రాంతికి గురి చేసింది. - కేంద్రమంత్రి చిరంజీవి

కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత అవమానకరమైన రీతిలో వ్యవహరించాయి. ఉంటే ఉండండి.. పోతే పొండి అనే వైఖరి ప్రదర్శించాయి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాం. తమను పూచికపుల్లతో సమానంగా లెక్కకట్టారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. - లగడపాటి రాజగోపాల్

విభజనపై కాంగ్రెసు అధిష్టానం ఏ నిర్ణయంతో ఉన్నా, బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు మా ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేస్తాం. - రఘువీరా రెడ్డి

కాంగ్రెసు పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. - గంటా శ్రీనివాస రావు

రాయలసీమ విచ్ఛిన్నం కాకుండా తొలి విజయం సాధించాం. జగన్, కిరణ్, చంద్రబాబుల నిజస్వరూపం బయటపడంది. రాయలసీమలో రాజధాని, ప్రత్యేక సమ రాష్ట్ర సాధన కోసం పోరాడుతాం. - బైరెడ్డి రాజశేఖర రెడ్డి

సోనియాకి తెలంగాణవారమంతా రుణపడి ఉన్నాం. సోనియా ఎంతో సాహసాన్ని ప్రదర్శించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక చారిత్రక విజయం. ఇంతటి ప్రతిఘటన ఉండగా 60 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రమూ ఏర్పడలేదు. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ఆమోదించేందుకు కృషి చేస్తున్నాం. - జైపాల్ రెడ్డి

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు. ఈ విజయం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులది. నవ తెలంగాణను నిర్మించుకుందాం. - దామోదర రాజనరసింహ

తెలంగాణవాసుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి. కేంద్ర కేబినెట్‌కు, అధిష్ఠానానికి కృతజ్ఞతలు. తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ తన విశ్వసనీయతను మరింత పెంచుకుంది. - జానారెడ్డి

60 ఏళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరూ చేయని సాహసాన్ని సోనియా చేసి చూపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. - డికె అరుణ

తెలంగాణ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. - సునీతాలక్ష్మా రెడ్డి

పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన రోజును అవమానాలు, అవహేళనలు, ఆర్థిక, రాజకీయ అసమానతలకు అడ్డుకట్ట వేసిన రోజు. - పొన్నాల లక్ష్మయ్య

వెయ్యి మంది అమరుల త్యాగ ఫలం. ఇది ఏ పార్టీ ఘనత కాదు. విద్యార్ధుల ఆత్మ బలిదానం వల్ల జరిగిన నిర్ణయం. - ఎర్రబెల్లి దయాకర రావు

తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, రాష్ట్రపతి కూడా సంతకం పెట్టినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్లు, ఆకాంక్షలు నెరవేరినట్లు భావిస్తాం. - కోదండరామ్.

తెలంగాణ ఏర్పాటులో ఒక అడుగు ముందుకు పడింది. బిల్లుకు ఆమోదం లభించినప్పుడే తెలంగాణ కలలుసాకారమైనట్లు. - విజయశాంతి

ఆఖరిదాకా కాంగ్రెసు పార్టీని నమ్మలేం. శీతాకాల సమావేశాల్లోనే విభజన ప్రక్రియ పూర్తి చేయాలి. - బిజెపి

చిట్టచివరి నిమిషం దాకా అప్రమత్తంగా ఉందాం. అప్పుడే సంబరాలు వద్దు. - కెసిఆర్

హైదరాబాదుపై ఆంక్షలు లేని పది జిల్లాల తెలంగాణను ప్రజలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చూస్తుంటే ఆంక్థలు పెడుతున్నట్లుగా కనబడుతోంది. - హరీష్ రావు.

యూపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఔదార్యంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది. - రాపోలు ఆనంద భాస్కర్.

హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఆమోదించడం హర్షణీయం. - సిపిఐ నారాయణ

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బిల్లులోని అంశాల ఆధారంగా స్పందిస్తాం. - సిపిఎం

English summary
The Cabinet has finally approved a Parliamentary Bill for the creation of a separate state of Telangana with 10 districts on Thursday night, despite the GoM's recommendation of Rayala Telangana with 12 districts. The Cabinet also approved Hyderabad as the common capital of Telangana and Andhra Pradesh for a period not exceeding a decade, said Home Minister Sushilkumar Shinde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X