వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి బంద్:జగన్‌పై గుడ్లతో దాడి, సోనియా గుడి కూల్చివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telanganites obstruct YS Jagan, destroyed Sonia's Temple
హైదరాబాద్: చెన్నై నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చేరుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కోడిగుడ్లతో దాడి చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఈ రోజు తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే.

సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ నాయకులను కలుస్తున్న జగన్ చెన్నైలో జయలలిత, కరుణానిధిలను కలిసి బుధవారం హైదరాబాదుకు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి జగన్ కాన్వాయ్ వస్తుండగా విద్యార్థులు, తెలంగాణవాదులు జగన్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. గుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి, దాదాపు యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు.

సోనియా తాత్కాలిక గుడి కూల్చివేత

కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్‌లో గల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తాత్కాలిక గుడిని తెలంగాణవాదులు కూల్చివేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఓయులో ఉద్రిక్తత

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ఏర్పడ్డాయి. విద్యార్థులు రాయల తెలంగాణను నిరసిస్తూ బైక్ ర్యాలీతో వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్జీరంగా రంగా వర్సిటీలో విద్యార్థులు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు సచివాలయం వద్ద భారీగా బిఎస్ఎఫ్ దళాలను మోహరించారు. ఉద్యోగులను మినహా లోనికి ఎవరినీ అనుమతించడం లేదు.

English summary

 The Telanganites obstructed YSR Congress Party chief YS Jaganmohan Reddy in Hyderabad and destroyed AICC chief Sonia Gandhi's temporary temple in Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X