గుండెపోటు నుంచి అదే కాపాడింది..: మాగంటి బాబు, నేడు డిశ్చార్జి!
Recommended Video

విజయవాడ: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో చేపట్టిన సైకిల్ యాత్రలో టీడీపీ ఎంపీ మాగంటి బాబు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయన.. తన ఆరోగ్యంపై స్పందించారు.
వైద్యులు అందుబాటులో లేని సమయంలో టెలీమెడిసిన్ వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయని మాగంటి బాబు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన తనను విజయవాడ తీసుకువచ్చే సమయంలో వైద్యులు అంబులెన్సులోనే టెలీమెడిసిన్ ద్వారా ఈసీజీ చేశారని అన్నారు.

ఈసీజీ రిపోర్టును కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్‌బాబుకు సెల్ ఫోన్ ద్వారా పంపించారని, ఆయన సలహా మేరకు అందించిన ప్రథమ చికిత్సతోనే ఆసుపత్రి వరకు సురక్షితంగా చేరుకోగలిగానని గుర్తుచేసుకున్నారు. టెలీమెడిసిన్ ద్వారా గోల్డెన్ ఆవర్స్‌లో వైద్యం అందడంతో తాను ప్రాణాలను కాపాడుకోగలిగానని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని, గురువారం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్తున్నట్లు మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications