Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు పర్యటన... 3 టికెట్ల ఖరారు?

'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. తన కార్యక్రమంలో భాగంగా మూడు నియోజకవర్గాల పర్యటనతోపాటు అక్కడి రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకీ సీట్లు లేవు. కానీ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. తన పర్యటనలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరుతోపాటు నెల్లూరు జిల్లాలోని కోవూరు, కావలి నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టిసారించారు.

కందుకూరులో వైసీపీకి చెక్ పెట్టాలని..

కందుకూరులో వైసీపీకి చెక్ పెట్టాలని..


కందుకూరులో వైసీపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు అక్కడ తన పర్యటనను ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ తరఫున మానుగుంట మహీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు 2019 ఎన్నికల్లో టీడీపీలో చేరి పోటీచేయగా మానుగుంట చేతిలో ఓటమి చవిచూశారు. ఆయనతోపాటు దివి శివరాం కూడా ఇక్కడి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇంటూరు నాగేశ్వరరావు కొనసాగుతున్నారు.

 కావలిలో దూకుడుమీదున్న మాలేపాటి

కావలిలో దూకుడుమీదున్న మాలేపాటి


కందుకూరులో పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు కావలి వస్తారు. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్ ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కావలి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఇన్ ఛార్జిగా మాలేపాటిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో రామిరెడ్డికే వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో టీడీపీ కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించాలనే డిమాండ్ వస్తోంది. అయితే ఇక్కడ మాలేపాటి బాగా పనిచేస్తున్నారు. చంద్రబాబు పర్యటన కోసం ఏర్పాట్లలో ఆయన మునిగిపోయారు.

కోవూరులో తెరపైకి యువనాయకత్వం

కోవూరులో తెరపైకి యువనాయకత్వం


కందుకూరు, కావలి పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు కోవూరు వస్తారు. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నల్లపురెడ్డికి చెక్ పెట్టడానికి కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. టికెట్ కూడా దినేష్ రెడ్డికే ఖరారవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఈసారి టీడీపీకి విజయావకాశాలున్నాయంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాలతోపాటు మాండౌస్ తుపాను వల్ల ట దెబ్బతిన్న రైతులతో చంద్రబాబు సమావేశమవబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+