చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు పద్మవ్యూహం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీలోని ముఖ్యనేతలను లక్ష్యంగా ఎంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తున్నారు. ముందుగా తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాపై దృష్టిసారించారు. జిల్లా మొత్తం పసుపు జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత బలీయమైన నేతగా, మంత్రివర్గంలో నెంబర్ టూగా చెలామణి అవుతోన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిరోధించడానికి కొన్ని సంవత్సరాలుగా తనలో నిక్షిప్తమైన ఉన్న రాజకీయ చాణక్యాన్ని, చతురతను బయటకు తీస్తూ చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

పార్టీనుంచి కోవర్టులు బయటకు

పార్టీనుంచి కోవర్టులు బయటకు


స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండాను ఎగరవేయడానికి ప్రధాన కారకులైన కోవర్టులను పార్టీ నుంచి సాగనంపారు. ఒకరకంగా ఇది తనకు అనుభవంలా ఉపయోగపడుతుందని భావించిన చంద్రబాబు మరింత జాగ్రత్తపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకుల హవాకు చరమగీతం పాడాలని నిర్ణయించారు.

 గంటా నరహరి, చల్లా బాబు

గంటా నరహరి, చల్లా బాబు


దానిలో భాగంగానే రాజంపేట లోక్ సభ స్థానానికి ఆర్థిక బలం, అంగబలం, సామాజిక వర్గ బలం ఉన్న గంటా నరహరిని ఎంపిక చేశారు. పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ స్థానానికి చల్లా బాబు ను అభ్యర్థిగా ప్రకటించి సవాల్ విసిరారు. ఇతరులు కూడా టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆర్థిక, అంగ బలగాలతో పెద్దిరెడ్డిని చల్లా బాబు ఢీకొట్టగలరనే నమ్మకంతో మిగిలినవారిని పక్కన పెట్టారు.

మాజీ ముఖ్యమంత్రి సోదరుడే..

మాజీ ముఖ్యమంత్రి సోదరుడే..


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు అనంతరం అత్యంత ప్రాధాన్యత వున్ననియోజకవర్గం పీలేరు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి స్వయానా సోదరుడైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అదే క్రమంలో మదనపల్లి నుంచి ఒక మైనారిటీ అభ్యర్థి కి అవకాశం కల్పించాలనే యోచనలో బాబు ఉన్నారు. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు తమ పొరుగు నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపగలుగుతారు. రాజంపేట లోక్ సభ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు ఆర్థిక, అంగబలాలతో వేర్వేరు సామాజిక వర్గాలకు చెంది బలీయంగా ఉండటం తెలుగుదేశం పార్టీ కి కలిసి వచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
telugu desam chief nara chandrababu naidu new strategy will implement on minister peddireddy ramachandrareddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X