గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే పరాకాష్టకు చేరింది. ఈ రెండు పార్టీలపై ఆయా పార్టీల పోస్టులపై కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఏపీలో వైసీపీ జెండా ఎగరబోతోందని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ ఈ సర్వే నిర్వహించిందని, అందులో వైసీపీ 135 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమికి 40 అసెంబ్లీతోపాటు మూడు లోక్ సభ స్థానాలు రానున్నట్లు వెల్లడించారు.
తాజాగా వైసీపీ చేసిన ఈ ట్వీట్ కు తెలుగుదేశం పార్టీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ సర్వే చేసిందా..? ఇదేమి సర్వే రా బాబు మీ గన్నవరం గూట్లే చేశాడా? లేక మీ పార్టీ వాళ్లు మొత్తం బుర్రలేని గొర్రెలని ఐప్యాక్ వాడు సలహా ఇచ్చాడా?' అని తెలుగుదేశం పార్టీ తన ట్వీట్ లో పేర్కొంది. దీనికి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ యాడ్ ఫొటోను కూడా జత చేసింది.

గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ సర్వే చేసిందా ? 😀 ఇదేమి సర్వే రా బాబు...🤣 మీ గన్నవరం గూట్లే చేసాడా ? 😛 లేక మీ పార్టీ వాళ్ళు మొత్తం బుర్రలేని గొర్రెలని IPAC వాడు సలహా ఇచ్చాడా ?#YCPFakeBrathuku#EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh https://t.co/nLqUb2uNlw pic.twitter.com/edxinSvyQ6
— Telugu Desam Party (@JaiTDP) April 18, 2024
సర్వేల పేరుతో ఏపీలో విడుదలవుతున్నవనీ ఫేక్ సర్వేలని వార్తలు వస్తున్నాయి. ఊరు పేరు లేని సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారు. దీనివల్ల కచ్చితత్వంతో సర్వేలు చేసి నివేదికలు సమర్పించే కంపెనీలు కూడా నిజంగానే సర్వే ఫలితాలిస్తున్నాయా? లేదంటే గాలికి వార్తలను పోగేసి ఇస్తున్నాయా? అనే అనుమానం అందరిలో కలుగుతోంది. వాస్తవానికి గతంలో కొన్ని కంపెనీలు తాము ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాము? వాటిని ఎలా రూపొందించాము, అందుకు తగినట్లుగా వీడియోలు కూడా విడుదల చేసేవి. ఇప్పుడు కేవలం ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్స్ లో ఏదో ఒక కంపెనీ పేరుమీద సర్వే రిపోర్ట్ అంటూ విడుదల చేయడం, వాటిని కొందరు అనుసరించడం జరుగుతోంది. జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలయ్యేవరకు ఇదే పరిస్థితి నెలకొంటుంది.












Click it and Unblock the Notifications