చంద్రబాబుది ధైర్యం: రాయపాటి, జగన్‌కు నన్నపనేని సూచన
గుంటూరు: కేంద్రం, రిజర్వ్ బ్యాంకు సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధైర్యంగా రుణమాఫీ చేశారని గుటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడదు రాయపాటి సాంబశివరావు అన్నారు. సోమవారం తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో రైతుకోసం చంద్రన్న రైతు సదస్సు జరిగింది.
ఈ సదస్సులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ రాయపాటి సాంబశివరావులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ - రైతుల సమస్యలు తెలుసుకునేందుకే రైతుయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని ఎంపీ రాయపాటి వెల్లడించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని కేంద్రంపై పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి సూచించారు. సోమవారం ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అందరూ కలసి కట్టుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని రాజకుమారి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రూ.7.433కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఇప్పటికైన అర్హులుంటే రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖా మంత్రి పుల్లారావు చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో రైతు చైతన్యయాత్ర నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో బాగంగా నారాకోడూరూ గ్రామంలోని పంట పోలాలను మంత్రులు పుల్లారావు,హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడారు. నారా కోడూరు గ్రామంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని రైతులకు హామీయిచ్చారు. కాకర రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పందిరిసాగు రైతులకు రాయితీ రూ.50వేలకు పెంచేలా కృషి చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.












Click it and Unblock the Notifications