అంత సీన్ లేదు!: జగన్ పార్టీ నోరు విప్పకున్నా చంద్రబాబుకు నేతల షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవాలన్న టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు ఇతర పార్టీల నేతలు కౌంటర్‌లు ఇస్తున్నారు.

చదవండి: పార్టీ నేతలకు ప్రశ్నలతో చెమటలు పట్టించిన బాబు, ఎందుకంటే

బాబు దూకుడుపై వైసిపి మౌనం

బాబు దూకుడుపై వైసిపి మౌనం

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు తమవేనని టిడిపి నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిత్యం టిడిపిపై విమర్శలు గుప్పించి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రభావమో... మరేమో కానీ వారు మాట్లాడటం లేదు.

చంద్రబాబు వల్ల కాదని

చంద్రబాబు వల్ల కాదని

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు తామే గెలుస్తామని టిడిపి నేతలు చెప్పడం అతి విశ్వాసమే అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి, సిపిఎం నేతలు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయడం చంద్రబాబు వల్ల కాదని చెబుతున్నారు.

మీ లోపాలు కనిపించడం లేదా

మీ లోపాలు కనిపించడం లేదా

తాజాగా సిపిఎం మధు మాట్లాడారు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడం సబబు కాదని, ఆ విధంగా చేయడం ఆయనకు సాధ్యం కాదని తేల్చేశారు. అధికారంలో ఉన్న వారు ఏదైనా మాట్లాడుతారని, వాళ్ల లోపాలు ఎవరికీ కనబడవని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే బిజెపి విమర్శలు

ఇప్పటికే బిజెపి విమర్శలు

2019 ఎన్నికల్లో టిడిపి 175 స్థానాల్లో గెలుస్తుందన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బిజెపితో కలిసి మొత్తం స్థానాలు గెలుస్తామని చెబుతున్నారా లేక ఒంటరిగానా లోకేష్ చెప్పాలని నిలదీస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Vishnu Kumar Raju and CPM leader Madhu said that Telugu Desam will not win 175 seats in Andhra Pradesh state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X