పార్టీ నేతలకు ప్రశ్నలతో చెమటలు పట్టించిన బాబు, ఎందుకంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చెమటలు పట్టించారంటున్నారు. నేతల వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఆయన వారికి ఓ ప్రశ్నావళిని ఇచ్చారు.

కాంగ్రెస్ టార్గెట్ జగన్, సోనియా-రాహుల్‌లతో క్షమాపణ చెప్పించాలని..

  చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. చంద్రబాబుకు షాక్!

  ఈ సందర్భంగా నేతలకు చెమటలు పట్టాయని అంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిత్వం, చెడు అలవాట్లు, దూమపానం, మద్యం తదితర అలవాట్ల గురించి ప్రశ్నావళిలో రూపొందించారు. వీటిని నింపేందుకు ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

  ప్రశ్నాపత్రం ఎలా ఉన్నా

  ప్రశ్నాపత్రం ఎలా ఉన్నా

  ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్‌ను ఏర్పాటు చేసి, రెండు రోజుల పాటు చంద్రబాబు నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నాపత్రం ఇచ్చారు. ప్రశ్నాపత్రం మాట ఎలా ఉన్నప్పటికీ.. ఆ ప్రశ్నలు కాస్త ట్యాబ్‌లో ఉండేసరికి వాటిని పూర్తి చేయలేక ఎమ్మెల్యేలు తంటాలు పడ్డారని తెలుస్తోంది. కొంతమంది తమ సిబ్బందికి ఆ ఫైల్ ట్రాన్స్ మీట్ చేసి, వారితో పూర్తి చేయించారని అంటున్నారు.

  ట్యాబ్ ఆపరేట్‌పై

  ట్యాబ్ ఆపరేట్‌పై

  రెండో రోజు వర్క్‌షాపు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గాల ఇంచార్జులు పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసం ముగిసిన తర్వాత ట్యాబ్‌లు ఎంతమంది తీసుకొచ్చారని, వాటిని ఆపరేట్ చేయడం ఎంతమందికి వచ్చాని చంద్రబాబు ప్రశ్నించారు. దానికి కొంతమంది చేతులు ఎత్తారు.

  ప్రశ్నావళి

  ప్రశ్నావళి

  ఆ తర్వాత నేతల వ్యక్తిత్వ వికాసాన్ని, స్వభావాలను తెలుసుకోవడానికి ప్రశ్నావళిని వారి ట్యాబ్‌లోకి సెండ్ చేశారు. ఆ ప్రశ్నావళిని వెంటనే పూర్తి చేసి ట్యాబ్‌లు క్లోజ్‌ చేయాలని చంద్రబాబు సూచించారు.

  టెక్కీల సాయం తీసుకున్నారు

  టెక్కీల సాయం తీసుకున్నారు

  ఆ ప్రశ్నావళిని నింపేందుకు నేతలు కొంత గాబరాపడ్డారని తెలుస్తోంది. కొందరు పక్కనున్న వారితో చెప్పించుకున్నారని తెలుస్తోంది. కొంతమంది సీనియర్ టిడిపి నేతలు టిడిపి బ్యాక్ ఆఫీసులో ఉండే టెక్కీలతో ప్రశ్నావళిని పూర్తి చేయించారు.

  ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

  ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

  ప్రశ్నావళితో పలువురు నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారని తెలుస్తోంది. ధూమపానం అలవాటు ఉందా, నిర్ణయాలు వేగంగా తీసుకుంటారా, పదిమందితో కలిసి తిరుగుతారా, నిర్ణయాల్లో ధృఢంగా వ్యవహరిస్తారా ఇలా పలు ప్రశ్నలు ఉన్నాయని తెలుస్తోంది. కొందరు నేతలకు చెమటలు పట్టాయని తెలుస్తోంది.

  ప్రశ్నావళి ఎందుకంటే

  ప్రశ్నావళి ఎందుకంటే

  కాగా, థామ్‌సన్‌ గ్రూపు ఈ ప్రశ్నావళిని రూపొందించింది. జవాబుల ఆధారంగా ఎమ్మెల్యేల మానసిక పరిస్థితిని అంచనా వేసి, అవసరమైతే కౌన్సిలింగ్‌ చేసి, వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడమే కాకుండా సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొదించే విధంగా చేయటమే ఈ ప్రశ్నావళి ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party chief and Chief Minister Nara Chandrababu Naidu gave questioner to Telugu Desam party leaders in Vijayawada party work shop on second day.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి