అమరావతిలో యువతకు గుడ్ న్యూస్..! ఫ్రీ ట్రైనింగ్, ఉద్యోగాలు..! అర్హతలివే..!
ఏపీ రాజధాని అమరావతి (Amaravati) పరిధిలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు సైతం కల్పించేందుకు వీలుగా రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ (APCRDA)సిద్దమైంది. ఇందులో భాగంగా లైఫ్ సైనెస్స్ రంగంలో డిగ్రీ చేసిన వారికి ఈ శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ప్రాంత యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఆర్డీయే తెలిపింది.
లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ సహకారంతో రాజధాని యువతకు ఉచితంగా 3 నెలల నైపుణ్య శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీఏ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. స్వర్ణభారత్ ట్రస్ట్, ఆత్కూరు, కృష్ణా జిల్లాలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌గా నిర్వహించబడుతోంది. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు సైతం అందిస్తారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే వారికి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, ఇండస్ట్రీ నిపుణుల శిక్షణ, ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుంది.

ఉచిత శిక్షణ తర్వాత లభించే ఉద్యోగాల్లో ట్రైనీ - మైక్రోబయాలజిస్ట్ (క్వాలిటీ కంట్రోల్), ట్రైనీ - ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్ (స్టెరైల్ ఫార్మ్యులేషన్), ట్రైనీ - కెమిస్ట్ (ప్రొడక్షన్ - ఫార్మా, కాస్మెటిక్స్ & బయోలాజికల్స్ వంటివి ఉన్నాయి. వీటికి అర్హతలు B.Sc / M.Sc (మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ), D.Pharm / B.Pharm / M.Pharm, డిప్లొమా / B.E / B.Tech (కెమికల్ సంబంధిత విభాగాలు), ఏదైనా లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ 2023 నుంచి 2026 వరకు పాసవుట్ అయిన అభ్యర్థులు అర్హులు. ప్రధాన ప్లేస్‌మెంట్ భాగస్వాముల్లో Biological E, Cohance, Granules, MSN, Biocon, Aurobindo, Cipla, Natco, Dr. Reddy's, Hetero వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అమరావతి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఆర్డీయఏ కోరుతోంది. శిక్షణకు నమోదు చేసుకునే చివరి తేదీ 17-05-2026. వివరాలకై వాట్సాప్‌లో 9848424207(శంకర్)ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/nshNbvbwzitM84Rs6












Click it and Unblock the Notifications