బాబుకు జనం కొడుతారని భయం.., ప్రతీ సోమవారం పోలవరం వెళ్లేది అందుకే?: జగన్

ఏలూరు: పోలవరం పనులను పరిశీలించే పేరిట ప్రతీ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చే చంద్రబాబు.. తన కలెక్షన్ల లెక్క చూసుకునేందుకే అక్కడికి వస్తుంటారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు సక్రమంగా జరిగాయని, కేంద్రం నిర్మిస్తానన్న ఈ ప్రాజెక్టును లంచాలు, కమీషన్ల కోసం ఈ పెద్దమనిషి(చంద్రబాబు) 'నేనే కడుతా' అంటూ తీసుకున్నాడని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ఈ ఆరోపణలు చేశారు.

Recommended Video

    మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర
    ఇంకెప్పటికి పూర్తవుతుంది?:

    ఇంకెప్పటికి పూర్తవుతుంది?:

    పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్దతిలో బినామీ కాంట్రాక్టర్లను నియమించుకున్నారని జగన్ ఆరోపించారు. అందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు కూడా ఉన్నాడని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికీ 36లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి కావాల్సి ఉంటే నాలుగేల్లుగా కేవలం 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులే పూర్తయ్యాయి అని గుర్తుచేశారు. ఇలా అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఇప్పటిదాకా పూర్తయిన పోలవరం పనుల్లో.. 70శాతం పనులు వైఎస్ హయాంలో జరిగినవే అన్నారు.

    కాపులకు ఇచ్చిన హామిపై:

    కాపులకు ఇచ్చిన హామిపై:

    కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు వారిని మోసం చేశారని జగన్ అన్నారు. మత్య్సకారులను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి ఆ హామిని కూడా నెరవేర్చలేదన్నారు. కాపులు తమకు రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నిస్తే.. లాఠీలతో కొట్టించడం, దొంగ కేసులు పెట్టించడం, ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టించడం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పరిధిలో లేని అంశాలను నెరవేరస్తామని చంద్రబాబు చెప్పడం పచ్చి మోసం అవుతుందా? కాదా? అని ప్రశ్నించారు. అలాంటివారిపై 420 కేసులు పెట్టాలని అన్నారు.

    జనం కొడుతారని భయం..:

    జనం కొడుతారని భయం..:


    తెలుగుదేశం వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో కోసం క్లిక్ చేస్తే అక్కడ ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన జాబితా ఏమి కనిపించిందని జగన్ అన్నారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రణాళిక కనిపిస్తే ఆయన మోసాలు బయటపడి జనం కొడతారని చంద్రబాబుకు భయం అన్నారు.

    నేనేదైనా చేయగలిగింది మాత్రమే చెప్పగలుగుతానని, మిగతా వాటి విషయంలో ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు లాగా మోసాలకు పాల్పడనని అన్నారు. ప్రతీ కాపు సోదరుడికి హామి ఇస్తున్నానని వైఎస్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నట్టు.. అంతకన్నా ఎక్కువే చేస్తానని అన్నారు.

    ఏ ఒక్క హామి నెరవేర్చలేదు

    ఏ ఒక్క హామి నెరవేర్చలేదు


    గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామి అమలు కాలేదని జగన్ అన్నారు. 'రైతుల వ్యవసాయ రుణాలు రూ.87, 612 కోట్లు మాఫీ కాలేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలూ మాఫీ కాలేదు. నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతీ ఇవ్వలేదు.' అని చెప్పుకొచ్చారు. ఏ హామి నెరవేర్చకుండా ఇన్ని మోసాలు చేసిన నాయకుడిని ఇంకా నమ్ముతారా? అని ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+