వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్డుకు ఇద్దరు వైసీపీ, ఆ మంత్రులు నంద్యాలలోనే, రోడ్ల విస్తరణ దెబ్బేనా?

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కేంద్రీకరించాయి. ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను రెండు పార్టీలకు చెందిన నాయకులు కేంద్రీకరించారు. మంత్రులు,అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ నియోజక

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కేంద్రీకరించాయి. ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను రెండు పార్టీలకు చెందిన నాయకులు కేంద్రీకరించారు. మంత్రులు,అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి ఇంచార్జీలుగా నియమించింది టిడిపి. అయితే వైసీపీ కూడ ఈ నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించింది. ఈ రెండు పార్టీలు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

నంద్యాల: టిడిపి వ్యూహమిది, కానీ, వైసీపీ ఇలా, శిల్పాకు దెబ్బేనా?నంద్యాల: టిడిపి వ్యూహమిది, కానీ, వైసీపీ ఇలా, శిల్పాకు దెబ్బేనా?

ఈ ఏడాది మార్చిలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు అవసరమయ్యాయి. అయితే ఈ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే అధికార టిడిపి, విపక్ష వైసీపీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

మంత్రులతోపాటు ఎమ్మెల్యేలను కూడ అధికారపార్టీ ఈ నియోజకవర్గానికి ఇంచార్జీలుగా నియమించింది. 12 మంది ఎమ్మెల్యేలను టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఇంచార్జీగా నియమించారు. అయితే వైసీపీ కూడ టిడిపికి కూడ పోటీగా ఇంచార్జీలను నియమించింది.

అఖిలప్రియకు బాబు షాక్: ఏం జరిగినా సమాచారం, వారంతా టిడిపిలోకిఅఖిలప్రియకు బాబు షాక్: ఏం జరిగినా సమాచారం, వారంతా టిడిపిలోకి

ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు.అయితే ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తన సోదరుడు బ్రహ్మనందరెడ్డిని గెలిపించుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

.ఒక్కోవార్డుకు ఇద్దరేసి ఇంచార్జీలు నియమించిన వైసీపీ

.ఒక్కోవార్డుకు ఇద్దరేసి ఇంచార్జీలు నియమించిన వైసీపీ

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా నంద్యాల పట్టణం కీలకం. ఈ పట్టణంలోని 41 వార్డులున్నాయి.అయితే ఈ వార్డుల్లో మెజారిటీ ఓట్లను కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.ఈ మేరకు ఒక్కోవార్డుకు ఇద్దరేసి ఇంచార్జీలను నియమించింది.ఈ ఇంచార్జీలు ఆయా వార్డుల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పడుు అంచనావేస్తారు. ఎన్నికల సమయంలో తమ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యేందుకు ఆ వార్డులో పరిష్కరించాల్సిన సమస్యలేమిటి, ఏ అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయనే అంశాలను ఇంచార్జీలు అధ్యయనం చేయనున్నారు. ప్రచార సమయంలో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని ఈ విషయమై ప్రచారం నిర్వహించనున్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
ప్రతిరోజూ మంత్రుల సమీక్ష

ప్రతిరోజూ మంత్రుల సమీక్ష

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల ఇంచార్జీలుగా కాలువ శ్రీనివాసులు, పి.నారాయణ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియలను ఇంచార్జీగా నియమించారు.వీరితో పాటు 12 మంది ఎమ్మెల్యేలను కూడ బాబు నియమించారు. నిమ్మల రామానాయుడు, బొండా ఉమ, బోడే ప్రసాద్ సహా 12 మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఈ స్థానానికి ఇంచార్జీలుగా ఉన్నమంత్రులు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఎక్కడ ఉన్నా నంద్యాల ఉపఎన్నికల్లో చోటుచేసుకొంటున్న పరిణాాలను పరిశీలిస్తున్నారు.

టిడిపి తరహలోనే వైసీపీ ప్లాన్

టిడిపి తరహలోనే వైసీపీ ప్లాన్


నంద్యాల అసెంబ్లీ స్థానంలో విజయం సాధించేందకు టిడిపి ఏ రకమైన వ్యూహన్ని అమలు చేస్తోందో అదే తరహలో వైసీపీ కూడ ప్లాన్ చేస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను అప్పగించింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలను వైసీపీ ఇంచార్జీలుగా ప్రకటించింది. రెండు రోజుల్లో ఎమ్మెల్యేలంతా నంద్యాలలో మకాం వేయనున్నారు.

రహదారి విస్తరణ పనుల దెబ్బేనా

రహదారి విస్తరణ పనుల దెబ్బేనా

సుదీర్ఘకాలంపాటు పెండింగ్‌లో రహదారి విస్తరణ పనులు చేయిస్తామని భూమా నాగిరెడ్డి హమీ ఇచ్చారు. అయితే ఈ హమీని నెరవేర్చే బాధ్యతను మంత్రి అఖిలప్రియ తీసుకొన్నారు. అయితే రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ళ కూల్చివేత పనులను చేపట్టడం టిడిపికి ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే రోడ్ల విస్తరణ పనులను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఈ స్థానం నుండి ఆ పార్టీ కూడ రంగంలో నిలుస్తోందని ఆయన ప్రకటించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇళ్ళ కూల్చివేత ప్రక్రియ నష్టమేననే అభిప్రాయాలు లేకపోలేదు.

English summary
Telugu Desam and Ysrcp parties planning to win Nandyal by poll. ysrcp allotted two incharge for each ward in Nandyal municipality.Ysrcp MLAs will also join in campaign in by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X