టాలీవుడ్ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో సికింద్రాబాదు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆదివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన్ వరప్రసాద్.
ప్రసాద్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఆహుతి చిత్రంలో ఆహుతి ప్రసాద్‌గా ఆయన గుర్తింపు పొందారు. దాదాపు 120 తెలుగు, రెండు తమిళ చిత్రాలలో నటించారు.

పలు చిత్రాల్లో తనదైన శైలిలో ఉత్తమ నటన కనబరిచిన ఆహుతి ప్రసాద్ 2003లో నేను నిన్ను ప్రేమిస్తున్నానుకు ఉత్తమ విలన్‌గా, 2008లో చందమామ సినిమాకు ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్‌గా రెండుసార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆహుతి ప్రసాద్ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రశంసలు అందుకున్నారు.
చందమామ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయన కొన్నాళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.












Click it and Unblock the Notifications