ఎయిమ్స్ ఎంట్రన్ టాపర్ తెలుగు అమ్మాయి శ్రీవిద్య
విశాఖపట్నం: భారత దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ విశాఖ విద్యార్థినికి దక్కింది. స్థానిక సీతమ్మధార బాలయ్యశాస్ర్తీ లేఅవుట్‌కి చెందిన పట్టిసపు శ్రీవిద్య ఎయిమ్స్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. శ్రీవిద్య తండ్రి ప్రసాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంచరపాలెం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
శ్రీవిద్య తల్లి రాజ్యలక్ష్మి కెనరాబ్యాంక్‌లో పనిచేస్తున్నారు. శ్రీవిద్య చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ వచ్చింది. పెదవాల్తేరులోని కిడ్స్ క్రియేషన్ అనే చిన్న స్కూల్‌లో చదువు ప్రారంభించిన శ్రీవిద్య ప్రాథమిక విద్యను విశాఖలోనే పూర్తి చేసింది.

6,7,8 తరగతులు కాకినాడలో చదివి ఆ తరువాత విశాఖ వచ్చింది. పదో తరగతి వరకూ శ్రీప్రకాష్ స్కూల్‌లో చదివిన శ్రీవిద్య ఇంటర్మీడియట్ విద్యను శ్రీచైతన్య, నారాయణ సంయుక్తంగా నిర్వహిస్తున్న చైనా బ్యాచ్‌లో చేరింది.
శ్రీవిద్య ఎయిమ్స్ పరీక్షపై పెద్దగా దృష్టి సారించలేదు. ఉత్తరాదికి వెళ్లి చదవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ఆమె కొంత అయిష్టంగానే పరీక్ష రాసింది. ఈ పరీక్షలో మైనస్ మార్కులు ఉన్నందున తనకు తెలిసిన ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు రాసింది. మంచి ర్యాంక్ వస్తుందని భావించిన శ్రీవిద్యను ఏకంగా మొదటి ర్యాంకే వరించింది.












Click it and Unblock the Notifications