వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ కొత్త సీఎం టీంలో తెలుగు వ్యక్తి - కీలక బాధ్యతలు : తొలి నిర్ణయం అదే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తాజాగా పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆప్ ఏకపక్ష విజయం తో ఆ పార్టీ నుంచి సీఎంగా భగవంత్ మాన్ ఈ నెల 16 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందే ఆయన తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రికి తమ ఎన్నికల హామీల అమలు కీలక బాధ్యతగా మారింది. దీంతో..ఆ హామీల అమలులో భాగంగా.. అనుభవం - సిన్సియారిటీ ఉన్న అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, సీఎంగా అధికారికంగా బాధ్యతలు చేపట్టకుముందే ఆయన తొలి నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీఎం ముఖ్యకార్యదర్శిగా నియామకం

సీఎం ముఖ్యకార్యదర్శిగా నియామకం

కొత్త ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా అరిబండి వేణుప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న. ఆయన తల్లిదండ్రులు అరిబండి రంగయ్య, మంగమ్మలు. ప్రాథమిక విద్య మునగాలలో పూర్తి చేసిన ఆయన.. పదో తరగతి వరకు ఖమ్మంలో చదివారు. నాగార్జునసాగర్‌లో ఇంటర్‌, బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ ఎంఎస్సీ పూర్తి చేశారు. వేణుప్రసాద్‌కు విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖలో అనుభవం ఉంది. ఆయన నాయకత్వంలో ఉచిత విద్యుత్‌ అందించడం. ఎక్సైజ్‌ నుంచి ఆదాయం పొందడంపై ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

చీఫ్ సెక్రటరీ రేసులోనూ

చీఫ్ సెక్రటరీ రేసులోనూ

చీఫ్ సెక్రటరీ రేసులోనూ వేణు ప్రసాద్ పేరు వినిపిస్తోంది. 1991లో ఐఏఎస్‌గా ఎంపికై పంజాబ్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు. ఫరీద్‌కోట్‌, జలంధర్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎస్ రేసులో 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు వీకే సింగ్, అనురాగ్ అగర్వాల్ పేర్లతో పాటు వేణుప్రసాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వేణు ప్రసాద్ కు ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖల పట్ల అపారమైన అనుభవం ఉంది. ఆప్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించటం కీలకమైనది. వేణుప్రసాద్ పవర్‌కామ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఎన్నికల హామీల అమలులో కీలకంగా

ఎన్నికల హామీల అమలులో కీలకంగా


ప్రస్తుతం ఎక్సైజ్, టాక్సేషన్‌తో పాటు విద్యుత్ శాఖ పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. సిఎంఓలో, పదవీవిరమణ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ప్రధాన కార్యదర్శి హుస్న్ లాల్ స్థానంలో వేణుప్రసాద్ నియమితులయ్యారు. హుస్న్ లాల్ ఇప్పుడు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. సిఎంఓలో, పదవీవిరమణ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ప్రధాన కార్యదర్శి హుస్న్ లాల్ స్థానంలో వేణుప్రసాద్ నియమితులయ్యారు. అకాలీదళ్.. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని పక్కన పెట్టి.. పూర్తి విచారణ తరువాత తమకు కావాల్సిన రీతిలో కీలక స్థానాల్లో కొత్త అధికారులను కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చేసుకుంటున్నారు.

English summary
Telugu person got key position in Punjab new CM Bhagawanth man team, Venuprasad appointes As CMO Principal secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X