చీఫ్ జస్టిస్ రమణకు తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు: ఆశీర్వచనాలు ఇచ్చిన టీటీడీ వేదపండితులు

సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంకు చీఫ్ జస్టిస్‌గా ఒక తెలుగు వ్యక్తి నియమితులవడం తొలిసారి కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే తాజా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణపై గతంలో పలు ఆరోపణలు చేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి బోబ్డేకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఏపీ సీఎం ట్విటర్‌లో అభినందనలు తెలపడంతో ఇటు రాజకీయాలను ఫాలో అవుతున్న ప్రజలకు అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభినందనలు తెలుపుతూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన అపార అనుభవం దేశ ప్రయోజనకాలకు పనికొస్తుందని తాను భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్. పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

Telugu state CMs Jagan and KCR Congratulate new CJI NV Ramana over his appointment

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీటీడీ వేదపండితులు జస్టిస్ ఎన్వీ రమణకు ఆశీర్వచనాలు అందజేశారు. టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు జస్టిస్ ఎన్వీ రమణను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే దేశ అత్యున్నత పదవుల్లో ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉండటం తెలుగు జాతికి గర్వకారణమంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలు ఒకరికొకరు అభివాదం తెలుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+