చంద్రబాబు-రేవంత్ భేటీ అజెండా ఖరారు..! ఇద్దరూ ఒప్పుకుంటే మోడీ సై..!

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు దాటిపోతున్నా ఇంకా ఉమ్మడి సంస్థల విభజన సహా పలు పెండింగ్ సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో భేటీ కానున్నారు. నగరంలోని ప్రజా భవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఓ పరిష్కారం కనుగొంటారని తెలుస్తోంది.

telugu states chief ministers Chandrababu and revanth reddy to meet tomorrow-here is agenda

చంద్రబాబు-రేవంత్ రెడ్డి భేటీలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించబోతున్నారు. విభజన జరిగి పదేళ్లయినా ఈ సంస్థలు మాత్రం ఇంకా విభజించలేదు. వాస్తవానికి కేంద్రం ఈ సంస్థల విభజనపై పదేళ్ల క్రితం షీలా బేడీ కమిటీ వేసింది. షెడ్యూల్ 9లో 91 సంస్థలుంటే వీటిలో 68 సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై ఎలాంటి ఇబ్బందీ లేదు. మరో 23 సంస్థలపై పేచీ నెలకొంది. అలాగే షెడ్యూల్ 10లో 142 సంస్థలుంటే వీటిలో దాదాపు 30 సంస్థల విభజనపై వివాదాలున్నాయి.

అలాగే రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల పరస్పర చెల్లింపుల అంశంపైనా చంద్రబాబు-రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరగనుంది. తెలంగాణ తమకు ఏపీ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, ఏపీ కూడా తమకు రూ.7 వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. వీటిపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న భవనాలను ఈ మధ్యే రేవంత్ సర్కార్ పదేళ్లు దాటిందన్న కారణంతో స్వాధీనం చేసుకుంది. వీటిపైనా చంద్రబాబు చర్చించే అవకాశముంది. ఇక పోలవరం వల్ల మునిగే గ్రామాల అంశంతో పాటు మరికొన్నింటిపైనా చర్చ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+