వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్ర్రాల బంధం... జగన్ ,కేసీఆర్‌లు ఓకే ఫ్లైట్‌లో ఢిల్లీకి..

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కలిసి వెళ్లనున్నారు. ఈనెల 30న మధ్యహ్నాం 12.23కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రమాణస్వీకారానికి హజరుకానున్నారు. ఇక అనంతరం ప్రధాని మోడీ రెండోసారీ జరుగుతున్న ప్రమాణస్వీకారం కూడ ముప్పైవ తేదీ సాయంత్రం 7 గంటలకు జరుగుతుండడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ , కేసీఆర్‌లు కలిసి ఓకే ఫ్లైట్‌లో వెళ్లనున్నట్టు సమాచారం.

telugu states cm s will be attended to the Modis wearing-in ceremony

కాగా ఇప్పటికే రెండు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కలిసి తమ సమస్యలను సాధించుకోవడం కలిసి పని చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గతాని కంటే భిన్నంగా పరిస్థితులు తయారయ్యాయి. వీటిని కొనసాగించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మోడీ ప్రమాణా స్వీకారానికి వెళ్లిన నేపథ్యంలో అటు మోడీతో పాటు ఇటు రెండు తెలుగు ప్రజలకు కూడ మంచి సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసమే ఇద్దరు కలిసి వెల్లేందేకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావల్సిందిగా స్వయంగా జగన్ అహ్వానించిన విషయం తెలిసిందే...దీంతో ఆయన ప్రమాణస్వీకారానికి కేసిఆర్ ఉదయమే విజయవాడకు వెళ్లనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హజరైన అనంతరం తరిగి విజయవాడ నుండి ఢిల్లికి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలోనే 30వతేదీన మర్యాద పూర్వకంగా మోడీని కలిసిన అనంతరం మరుసటి రోజు కూడ ఇద్దరు ఢిల్లిలోనే మకాం వేయనున్నారు. ఇక మోడీతో రెండు రాష్ట్ర్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై చర్చించనున్నట్టు సమాచారం.

అయితే ఇలాంటీ పరిస్థితి గత రెండు ప్రభుత్వాల మధ్య లేదు..ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు ఒకే స్టేజీమీద తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అత్యధిక మెజారీటితో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ రెండు తెలుగు రాష్ట్ర్రాల సమస్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
both telugu states cm's kcr and jagan mohan reddy will be attended to the Modi's swearing-in ceremony at delhi, and they will go to the delhi by same flight, ofter completing ys jagan swearing-in ceremony at vijyawada they move to delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X