రేవంత్ కు చంద్రబాబు కీలక ప్రతిపాదన - ఢిల్లీ డెసిషన్..!!
రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుతోంది. కొద్ది నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. పలు ప్రతిపాదనలు..చర్చలు జరిగాయి. ఇందు కు కొనసాగింపుగా ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎస్ ల నేతృత్వంలో ప్రధాన అంశాల పైన మంగళగిరి లో సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనల పైన తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాలను వెల్లడించనుంది. దీంతో, ఈ సమావేశంలో జరిగే చర్చల పైన పాలనా పరంగా ఆసక్తి నెలకొంది.
కీలక అంశాలపై చర్చ
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో మంగళగిరి లోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ రోజు కీలక భేటీ జరగనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమలు కావాల్సిన నిర్ణయాల పైన చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న పెండింగ్ అంశాల పైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ ఏడాది జూలై 5న ఇద్దరు సీఎంలు చంద్రబాబు - రేవంత్ మధ్య హైదరాబాద్ లో జరిగిన చర్చల్లో పలు కీలక అంశాల పైన చర్చించారు. రెండు రాష్ట్రాలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని అంగీకారానికి వచ్చారు. ప్రధానంగా షెడ్యూల్ 9,10 లో పేర్కొన్న సంస్థలు..వాటి ఖాతాల్లో ఉన్న నిధుల పైన చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాలు చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచన చేసింది.

ప్రతిపాదనలు - స్పందన
ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్రం రెండు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఇంకా నిధులు రావాల్సి ఉంది. నేటి భేటీలో ఈ అంశం పైన చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తం రూ 7, 200 కోట్ల బకాయిల పైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఇప్పటికే రేవంత్ ను కోరారు. దీని పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుంది. ఉద్యోగుల పరస్పర మార్పిడి పైనా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ పైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా వృత్తి పన్ను పంపకం పై కూడా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బ్యాంకుల్లోని నిల్వలపై
రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరుగనుంది. హైదరాబాద్లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశం కూడా ఏపి ప్రతిపాదించనుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వల ఉండిపోయాయి. విభజన పూర్తి కానీ ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8 వేల కోట్లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా ఈ సంస్థల విభజన పూర్తి కాకపోవడంతో ఈ సంస్థలకు చెందిన 8 వేల కోట్లు అలాగే ఉండిపోయాయి. దీంతో, రెండు రాష్ట్రాల్లో ఆర్దిక పరిస్థితుల వేళ..ఈ నిధుల పైన ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications