అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి: ప్రకాశం జిల్లావాసి
టెక్సాస్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి శైలేంద్ర హర్ష మరణించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు వాసి.
ఈ రోడ్డు ప్రమాదంలో పామూరుకు చెందిన దీపక్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీపక్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు.

శైలేంద్ర హర్ష లామర్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ చేస్తున్నాడు. తండ్రి ప్రకాశం జిల్లాలో పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్నారు.
ఉగాది పండుగకు వస్తానని చెప్పి రాలేదని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు పెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విషయం తెలియగానే కందుకూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications