వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటులో పోరు, టీడీపీ నోటీసు, ధర్నా: ఎన్నిసార్లు ఇలా.. రాజ్‌నాథ్‌కు బాబు షాక్, ఇదీ లెక్క

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Retains Alliance With BJP But Ready To Put Pressure On Centre

న్యూఢిల్లీ/అమరావతి: బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంతో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోవద్దని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతల నుంచి కూడా టీడీపీ అధినేతకు ఫోన్లు వచ్చాయి.

చదవండి: జగన్ డబుల్ ప్లాన్, మోడీకి నేనెందుకు భయపడతా: బాబు, ఫోన్‌తో టీడీపీ యూటర్న్, మారిన వ్యూహం

చదవండి: 20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దోస్తీకి వచ్చిన నష్టం లేదు. అయితే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంతో దానిపై పార్లమెంటులో, బయట పోరాడాలని టీడీపీ నిర్ణయించుకుంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకు వచ్చే ప్రయత్నాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సోమవారం ఉదయం కూడా చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందుబాటులోని కేంద్రమంత్రులను కలవాలని సూచించారు. సభ ప్రారంభానికి ముందు ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. టీడీపీకి శివసేన, అకాలీదళ్‌లు మద్దతు ప్రకటించాయి.

చదవండి: నాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీత

పార్లమెంటులో పోరుకు సిద్ధం

పార్లమెంటులో పోరుకు సిద్ధం

సోమవారం విభజన అంశాలపై లోకసభలో స్వల్పకాలిక చర్చకు టీడీపీ నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ తోట నర్సింహం లోకసభలో విభజన అంశాలపై చర్చ కోసం 193 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. మరోవైపు రాజ్యసభలో నిరసన తెలిపేందుకు టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌లు సిద్ధమయ్యారు.

లెక్కతీస్తున్న టీడీపీ

లెక్కతీస్తున్న టీడీపీ

ప్రజలకు చెప్పేందుకు, కేంద్రం ముందు తమకు న్యాయం జరగలేదని వివరించేందుకు టీడీపీ ఎంపీలు అన్ని లెక్కలను తీస్తోంది. ఏపీ అడిగింది ఏమిటి, ఇచ్చింది ఏమిటి అనే విషయాలను అందరి ముందు ఉంచేందుకు వారి సిద్ధమవుతున్నారు. అడిగినవాటికి, ఇచ్చిన వాటికి పొంతన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడిగింది ఇదీ, ఇచ్చింది ఇది

అడిగింది ఇదీ, ఇచ్చింది ఇది

విభజన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్థిక లోటు రూ.16,500 కోట్లు అయితే, కేంద్రం రూ.7,500 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులోను ఇంకా రూ.3,382 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. పోలవరంకు ఏపీ రూ.7,.431 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ.4,323 కోట్లు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏపీ అడిగింది రూ.11వేల కోట్లు అయితే మంజూరు చేసింది రూ.2500 కోట్లు, అందులో విడుదల చేసింది రూ.1500 కోట్లు.

టీడీపీ నిర్ణయం

టీడీపీ నిర్ణయం

కాగా, బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని, రాష్ట్ర ప్రజల్లోని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలను కేంద్రానికి అర్ధమయ్యేలా చెప్పాలని టీడీపీ ఆదివారం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నదని వార్తలు వచ్చినప్పటికీ పార్లమెంటులో పోరాడాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకునేంత వరకు దశలవారీగా కేంద్రంపై ఒత్తిడి పెంచనుంది.

చంద్రబాబుకు రాజ్‌నాథ్ నుంచి ఫోన్

చంద్రబాబుకు రాజ్‌నాథ్ నుంచి ఫోన్

సమావేశం జరుగుతున్న సమయంలో రాజ్‌నాథ్ సింగ్‌ నుంచి చంద్రబాబుకు ఫోన్‌ వచ్చింది. బీజేపీ, కేంద్రం తరపున కాకుండా వ్యక్తిగత హోదాలోనే మాట్లాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, తొందరపాటు నిర్ణయాలేమీ వద్దన్నారు. ప్రధాని మోడీని కలవాలన్నారు. ఆయనకు చంద్రబాబు కాస్త గట్టిగానే బదులిచ్చినట్టు చెబుతున్నారు.

రాజ్‌కు ఘాటుగా చంద్రబాబు

రాజ్‌కు ఘాటుగా చంద్రబాబు

ప్రధానిని ఎన్నిసార్లు కలిసినా ఏం ప్రయోజనమని, ఇప్పటికే చాలాసార్లు కలిశానని, బడ్జెట్‌కు ముందు కూడా మరోసారి కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరినా ప్రయోజనం లేదని ఆయనతో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడాక ముఖ్యమంత్రి సమావేశాన్ని కొనసాగించారు. ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం, ఎంపీల రాజీనామాలు వంటి తొందరపాటు నిర్ణయాలేమీ ఇప్పటికిప్పుడు అవసరం లేదని, ఇదే సమయంలో ప్రజాప్రయోజనాల విషయంలోనూ రాజీ పడరాదన్నారు.

English summary
The Telugu Desam Party MPs have decided to talk tough in Parliament on issues related to the state and convey to the Centre the displeasure and anger of the people of the state over lack of specific budgetary allocations for the major projects in the state such as the Polavaram irrigation project and the construction of the new capital Amaravati, and the promised new railway zone at Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X