హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఎండ- బరాబర్ సెగ

Temperature in Hyderabad: తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తోంది. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీలుగా నమోదవుతోండటమే దీనికి నిదర్శనం.

వచ్చే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ అభివృద్ది ప్రణాళిక మండలి, భారత వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. ఫిబ్రవరిలోనే పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డాయి.

Temperature Predicted as likely to touch 40 degree Celsius by the end of Feb in Hyderabad

హైదరాబాద్‌లో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని టీజీడీపీఎస్ పేర్కొంది. సాధారణంగా ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 33 నుంచి 36 డిగ్రీల వరకు ఎండ కాస్తుంటుంది. ఈ సీజన్‌లో మాత్రం నాలుగు డిగ్రీలు అధికంగా దీని తీవ్రత ఉండబోతోందని టీజీడీపీఎస్ వైవీ రామారావు అంచనావేశారు. ఈ నెలా చివరి నాటికి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరవచ్చని చెప్పారు. తొలిసారిగా ఫిబ్రవరిలో 40 డిగ్రీల రికార్డు కావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అటు ఏపీలోనూ ఇదే తీవ్రత కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 10కి పైగా వేర్వేరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం.. వచ్చే వేసవి తీవ్రత ఎలా ఉండబోతోందనే విషయాన్ని రుచి చూపించినట్టయింద. శుక్రవారం నాడు కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రల ఎండ కాసింది.

కోస్తా జిల్లాల్లో గాలిలో తేమశాతం 45 నుంచి 70 శాతం వరకు ఉండగా.. ఈ సంఖ్య రాయలసీమలో 25 నుంచి 45 శాతంగా రికార్డయింది. పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+