కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు శ్రీకాకుళంవాసులు సహా 10 మంది మృతి
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు
గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును తప్పించబోయి లారీ ఫుట్‌పాత్‌పైకి ఎక్కడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఇద్దరు స్కూల్ విద్యార్థుల మృతి
అనంతపురం పట్టణంలో టీవీ టవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్కూలు విద్యార్థులు మరణించారు. వేగంగా వస్తున్న టిప్పర్ ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications