తెనాలి యువకుడు ప్రేయసి కోసం కర్ణాటకకు వెళ్లి శవమై వచ్చాడు
గుంటూరు: ప్రేయసి కోసం వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి యువకుడు కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను హత్యకు గురయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లోఈ దారుణం జరిగింది. అతని ప్రేయసి కుటుంబ సభ్యులే హత్య చేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
మృతుడి తల్లిదండ్రులు గౌరీ మహాలక్ష్మి, నాగేశ్వరరావు, సోదరుడు పురుషోత్తం శనివారంనాడు తమ తరఫు న్యాయవాది శివకోటేశ్వర రావు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు. వారు చెప్పిన వివరాల ప్రకారం -
గుంటూరు జిల్లాలోని తెనాలి గంగనామ్మపేటకు చెందిన కరప మధు(24) అనే యువకుడు రాయచూర్‌కు చెందిన ఇక్కడి బోస్ రోడ్డులో గల ఓ కోచింగ్ సెంటర్‌లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన శ్వేతాకుమారి అలియాస్ సోనీ అనే యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని శ్వేతకుమారి తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లి చేసుకుంటామని కూడా ఆమె చెప్పింది.

అయితే, మధు ప్రభుత్వోద్యోగం సంపాదించాలని ఆమె తల్లిదండ్రులు షరతు పెట్టారు. అప్పటి వరకు పోస్టల్ కోచింగ్ తీసుకుంటూ సెల్‌ఫోన్ల షోరూంలో పనిచేస్తున్న అతను ఉద్యోగం వదిలేసి విజయవాడలోని మరో కోచింగ్ సెంటర్‌లో శిక్షణకు చేరాడు. శ్వేత కూడా అతనితో పాటే విజయవాడలో కోచింగ్‌లో చేరింది.
ఏడు నెలలల క్రితం పోస్టల్ శాఖలో ఉద్యోగం నిమిత్తం శ్వేత స్వంత ఊరికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెను కలిసేందుకు సెప్టెంబర్ 25వ తేదీన మధు అక్కడికి వెళ్లడా. 27వ తేదీన తండ్రికి ఫోన్ చేసి శ్వేతను కలిశానని, సోమవారం వచ్చేస్తున్నట్లు చెప్పాడు.
అయితే, 28వ తేదీన కర్ణాటక మానవి పోలీసులు ఫోన్ చేసి మధు హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. మధు మృతదేహం కాలిపోయి ఉంది. దీంతో తమను కూడా చంపేస్తారనే భయంతో పోలీసులకు చెప్పకుండా తిరిగి వచ్చేశారు. మధును శ్వేతకుమారి కుటుంబ సభ్యులే హత్య చేశారని గౌరిమహాలక్ష్మి, నాగేశ్వర రావుఆరోపించారు. బంధువులు, పెద్దలు ధైర్యం చెప్పడంతో మానవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications