Tenali: వైసీపీ అభ్యర్ధి చెంప చెళ్లుమనిపించిన ఓటర్-పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. అదీ పోలింగ్ బూత్ లోనే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఒకరు పోలింగ్ బూత్ కు వచ్చి అక్కడే ఉన్న ఓ సాధారణ ఓటరును కొట్టారు. దీంతో ాయన కూడా తిరిగి ఎమ్మెల్యేను కొట్టారు. చూస్తుండగానే ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారిని దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివకుమార్..ఇవాళ ఓటు వేసేందుకు స్దానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ క్యూలైన్ ఉన్నా పట్టించుకోకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోయారు. దీంతో అప్పటికే క్యూలైన్లో ఉన్న ఓ సాధారణ ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చెంపపై కొట్టారు.

దీంతో సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ ను తిరిగి చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేను చెంప చెళ్లుమనిపించిన సదరు ఓటర్ పై తిరిగి ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ఆయన్ను కొట్టేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, పోలీసులు వెంటనే వారిద్దరినీ దూరంగా పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications