విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు-విజయవాడ మధ్య తిరుగుతున్న 'రాజకీయం'!

|
Google Oneindia TeluguNews

రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలుగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు పేరు. రాజకీయ పార్టీలు ఒకటికి రెండుసార్లు కూలంకుషంగా పరిశీలించుకున్న తర్వాతే అభ్యర్థులను బరిలోకి దించుతాయి. ఈ రెండు జిల్లాల్లో పైచేయి సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా గెలుపొంది అధికారం చేపట్టడం సులభమవుతుంది. రాజకీయ వాతావరణం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ రెండు జిల్లాల్లో ఓటరు నాడిని పట్టుకోవడానికి కృషి చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లోని గుంటూరు, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పదుల సంఖ్యలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేయడం కష్టమని వార్తలు వస్తున్నాయి. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేశినేనికి, పార్టీ అధిష్టానానికి మధ్య దూరం పెరిగింది. విమానాశ్రయంలో చంద్రబాబుకు బొకే ఇవ్వమంటే తిరస్కరించడంతోపాటు అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనతోపాటు చేసిన పలు వ్యాఖ్యలు కూడా ఆయనకు, పార్టీకి మధ్య అంతరాన్ని పెంచాయి.

tens of news are circulating from Guntur and Vijayawada Lok Sabha constituencies in these two districts.

అలాగే రానున్న ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరఫున ఎవరు? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్ పోటీచేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ పోటీచేస్తారా? అనే విషయం సందిగ్ధంలో ఉంది. తాజాగా వైసీపీ తరఫున విజయవాడ నుంచి నాగార్జున పోటీచేస్తున్నారంటూ వార్తలు వస్తే వాటిని ఆయన ఖండించారు. కేశినేని బీజేపీలోకి వెళ్లి 2024 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేస్తారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ అధిష్టానం కేశినేని నానిని గుంటూరు నుంచి పోటీచేయమంటున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది.

గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేశినేని నాని సోదరుడు చిన్నిని టీడీపీ తరఫున నిలబెడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన ఇప్పటికే పార్టీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కేశినేని చిన్నికి మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగానే లగడపాటి రాజగోపాల్ టీడీపీ తరఫున విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ ఎంపీగా పోటీచేయవచ్చని ప్రచారం నడుస్తోంది. మరోవైపు గద్దే రామ్మోహన్ ను విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేయమన్నారని, విజయవాడ తూర్పు నుంచి ఆయన సతీమణి అనురాధను బరిలోకి దించవచ్చన్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నిరకాల వార్తల మధ్య అసలైన వార్త ఏది? అనే విషయమై ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

English summary
Currently, tens of news are circulating from Guntur and Vijayawada Lok Sabha constituencies in these two districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X