నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు - మంత్రి వ్యాఖ్యల వైరల్ : తాజా మంత్రుల్లో కలకలం..!!

ఏపీ కేబినెట్ లో మంత్రుల పరిస్థితి విచిత్రంగా ఉంది. ప్రస్తుతానికి వారు మంత్రులే. భవిష్యత్ లో మంత్రులుగా ఉంటారా లేదా. సీనియర్లలోనూ ఇప్పుడు అడే డిస్కషన్. ముఖ్యమంత్రి జగన్ తన రెండున్నారేళ్ల పాలన తరువాత 90 శాతం మంత్రులను మారుస్తానంటూ తొలి సారి కేబినెట్ కూర్పు సమయంలో స్పష్టం చేసారు. దీంతో...సీనియర్లు..బలంగా ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే వాళ్లు తమకు ఇబ్బంది ఉండ దనే ధీమాతో ఉన్నారు. కానీ, మంత్రి బాలినేని వ్యాఖ్యలతో ఒక్క సారిగా వారి ఆశలన్నీ కరిగిపోయాయి.

బాలినేనితో అందు కోసమే చెప్పించారా

బాలినేనితో అందు కోసమే చెప్పించారా

కొందరిని ఉంచి...మరి కొందరిని తీయటం ద్వారా కొత్త సమస్యలకు అవకాశం లేకుండా అందిరనీ మార్చి.. కొత్త వారితో ఎన్నికల కేబినెట్ సిద్దం చేసుకోవాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. బాలినేని ఉద్దేశ పూర్వకంగానే మంత్రులందరినీ తప్పిస్తున్నారని బయటకు చెప్పటం..ఆ తరువాత దీనికి భిన్నంగా ఎటువంటి కామెంట్స్ బయటకు రాకపోవటంతో ఇక మంత్రులంతా డిసైడ్ అయిపోయారు. బాలినేని తనతో ముఖ్యమంత్రే చెప్పారని చెప్పటం ద్వారా జరగబోయేది ఏంటో మంత్రులకు అర్దం అయిపోయింది.

మంత్రుల్లో అప్పుడే టెన్షన్ మొదలు

మంత్రుల్లో అప్పుడే టెన్షన్ మొదలు

దీంతో..కొందరు మంత్రులు మాత్రం ఇక, కొద్ది కాలమే తాము మంత్రులుగా ఉంటామనే నిర్ణయానికి వచ్చే సారు. కొంత మంది మంత్రులు మాత్రం గతంలో ఉన్న విధంగా యాక్టివ్ గా కనిపించటం లేదు. సాధారణం గా పార్టీ - ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శలు చేసిన సమయంలో వాటిని తిప్పి కొట్టటంతో మంత్రులు పోటీ పడేవారు. కానీ, ఇప్పుడు ఆ చొరవ కనిపించటం లేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ చేసారు. దీని పైన నలుగురు అయిదుగురు మంత్రులు మాత్రమే స్పందించారు.

మంత్రి నాని వ్యాఖ్యల వైరల్

మంత్రి నాని వ్యాఖ్యల వైరల్

ఇక, తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది.. నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు అంటూ మంత్రి పేర్ని నాని కామెంట్ చేసారు. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే పేర్ని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా...తమ పదవుల మీద ఎంతో కొంత ఆశతో ఉన్న కొందరు మంత్రులు ఇక తప్పదనే నిర్ణయానికి వచ్చేసారు.

అధికారం నుంచి అధికార పార్టీ సేవలోకి

అధికారం నుంచి అధికార పార్టీ సేవలోకి

తాము మంత్రి పదవి నుంచి తప్పుకోవటానికి సిద్దం కావాల్సిందేననే అభిప్రాయం వారిలో బలపడుతోంది. మంత్రులను సంసిద్దులను చేయటంలో భాగంగానే బాలినేని తో ఈ విషయాన్ని బయట పెట్టించారనే ప్రచారమూ కొందరు మంత్రుల సన్నిహితుల వద్ద వినిపిస్తోంది. అయితే, బొత్సా, పెద్దిరెడ్డి, కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని వంటి వారికి మాత్రం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. వారిని 2024 ఎలక్షన్ టీం పేరుతో పార్టీ-ప్రభుత్వ సమన్వయ బాధ్యతలు కేటాయిస్తారని చెబుతున్నారు.

కేబినెట్ కూర్పులో తమ వారి కోసం

కేబినెట్ కూర్పులో తమ వారి కోసం

అయితే, మంత్రులుగా తమను తప్పించి పార్టీ సేవలకు పరిమితం చేస్తారనే సమాచారం కొందరికి రుచించటం లేదు. అందునా రెండున్నారేళ్లుగా జిల్లాల్లో మంత్రులుగా అధికారం చెలాయిస్తూ..ఇప్పుడు తాము మాజీలు కావటం.. తమ వద్ద పనుల కోసం వచ్చిన వారు మంత్రులు కావటం వారికి కొత్త సమస్యగా మారుతోంది. అయితే, తిరిగి అధికారంలోకి వస్తే వీరికి మరో సారి అవకాశం ఉంటుందనే హామీ ఒక్కటే ఓదార్పుగా మారింది. ఇదే సమయంలో సీనియర్ మంత్రులు కొందరు తమ జిల్లాల్లో తాము చెప్పిన వారికి వచ్చే కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని సీఎం వద్ద ప్రతిపాదించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

జగన్ వ్యూహం అంతు చిక్కక

జగన్ వ్యూహం అంతు చిక్కక

కానీ, సీఎం మాత్రం ఇప్పటి వరకు తాము ఫాలో అవుతున్న సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగానే మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెబుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో మంత్రివర్గ కూర్పు పైన ఇప్పటికే సీఎం కసరత్తు చేసారనే ప్రచారమూ సాగుతోంది. మంత్రి పదవుల కోసం ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటే..సీనియర్లు మాత్రం పదవులు కోల్పోతున్నామనే ఆవేదనతో ఉన్నట్లు కనిపిస్తోంది.

Recommended Video

    AP Roads బాగుకై పోరాటం..YSRCP మార్క్ రాజకీయం | Oct 2nd పైనే ఫోకస్ || Oneindia Telugu
    ప్రక్షాళన ముహూర్తం ఖరారైందా

    ప్రక్షాళన ముహూర్తం ఖరారైందా

    అయితే, ఇంకా మరి కొంత సమయం ఉండటంతో అప్పటి లోగా సీఎం మనసు మారబోతుందా అనే ఆశలు వారిలో కనిపిస్తున్నాయి. కానీ, సీఎం అన్నీ ఆలోచించిన తరువాతనే ఈ నిర్ణయానికి వచ్చారని..ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఎంకు సన్నిహితంగా ఉండే మంత్రులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక, కేబినెట్ ప్రక్షాళన ఎప్పుడు ఉంటుందనేదే ఇప్పుడు చర్చగా కనిపిస్తోంది. కొందరు డిసెంబర్ అని చెబుతుంటే..మరి కొందరు ఈ లోగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+