జెడ్పీలో హంగామా: టీడీపీ సభ్యులను తోసేసిన వైసీపీ
చిత్తూరు: చిత్తూరు జెడ్పీ సమావేశం రసాభసగా మారింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. నిధుల విడుదల విషయంలో అధికార పార్టీ కావాలని జాప్యం చేయడంతో పాటు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని వైకాపా సభ్యులు సమావేశం ఆరంభంలోనే ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న సభ్యులు వేదిక పైకి వచ్చి అక్కడ ఉన్న టీడీపీ సభ్యులను తోసివేశారు. దీంతో ఉద్రిక్తంగా మారింది.
రాజధాని ఎక్కడైతే బస్ భవన్ అక్కడ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే బస్ భవన్ ఏర్పాటు చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్ర రావు తెలిపారు. విజయవాడ వచ్చిన ఎండీకి కృష్ణా రీజియన్ అధికారులు, ఈయూ, ఎన్ఎంయు కార్మిక సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అవసరం మేరకు 400 బస్సులను అద్దెకు అదనంగా తీసుకున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో సమ్మెలు, బందుల కారణంగా ఆర్టీసికి కోట్లాది రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీసుపైన చర్చలు సఫలమవుతాయన్నారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా చార్జీలు పెంచలేని పరిస్థితి ఉందన్నారు.












Click it and Unblock the Notifications