చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న రీపోలీంగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రీపోలింగ్ జరగనున్న అయిదు ప్రాంతాల్లో ఒకటైన ఎన్ఆర్ కమ్మపల్లి గురువారం రాత్రీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్‌లో భాగంగా ఆ ప్రాంతానికి వైసీపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అటు వైసీపీ కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలు గుమికూడారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు నానీ సైతం అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతవరణం నెలకోంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు తగు చర్యలు చేపట్టారు. జిల్లా అర్భన్ ఎస్పి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

చంద్రగిరిలో 5చోట్ల రీపోలీంగ్
కాగా వైసీపీ అభ్యర్థనమేరకు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలో రీపోలింగ్‌కు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన చివరి విడత పోలింగ్ సందర్భంగా ఈ అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ను నిర్వహించబోతున్నారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా, ఎలాంటి అవాంఛనీయ
సంఘటనలు చోటు చేసుకోకుండా సాగేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఏడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ ఫిర్యాదు
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా దళితులను అడ్డుకోవడంతోపాటు ,తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని అనుమానం వచ్చిన వారందరినీ ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, పోలింగ్ కేంద్రానికి కూడా వెళ్లనీయలేదని ,మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన దళితులను ఓటు వేయనివ్వలేదని ఆరోపించారు. ఏడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాధు చేశారు.

ఈసీ నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ
కాగా వైసీపీ ఫిర్యాదు స్వీకరించిన ఈసీ సీసీ కేమెరాల ఫుటేజీనీ పరీశీలించి మొత్తం ఐదు చోట్ల రీపోలింగ్ కు ఆదేశించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆందోళన బాట పట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ని రోజులకు రీపోలీంగ్ ఏమిటంటు జిల్లాలో ధర్నాకు దిగారు.దీంతో ఢిల్లోలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేశారు. ఈనేఫథ్యంలోనే రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.












Click it and Unblock the Notifications