వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమలో టెన్షన్ టెన్షన్- జిల్లాకు అంబేద్కర్ పేరుపై ఉద్రిక్తతలు- అమల్లోకి 144 సెక్షన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియ పూర్తయి జిల్లాల పేర్ల మార్పు కూడా అమల్లోకి వచ్చేసింది. అయినా ఇందులో తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పటికీ జిల్లాల్లో కాకరేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాను విభజించి కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేసిన అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి భారత రత్న అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో నిరసనలు పెరుగుతున్నాయి. దీంతో ఇవాళ్టి నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు

ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియలో అమలాపురం ఎంపీ నియోజకవర్గంగా ఉన్న కోనసీమ ప్రాంతం కాస్తా కోనసీమ జిల్లా అయింది. అయితే జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో పలు కొత్త జిల్లాలకు దివంగత నేతల పేర్లు పెట్టడంతో కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు సైతం అంబేద్కర్ లేదా బాలయోగి పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. కాపునేత ముద్రగడ పద్మనాభం సైతం జగన్ కు ఇదే డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం భారతరత్న బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లా పేరుకు కలిపింది.

అంబేద్కర్ జిల్లాపై నిరసనలు

అంబేద్కర్ జిల్లాపై నిరసనలు


రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ద్వారా ప్రభుత్వం సమంజమైన నిర్ణయమే తీసుకుందని ఎంతో మంది పార్టీలకతీతంగా అభినందించారు. కానీ జిల్లాలో కొన్ని కులాల నేతలు, మద్దతుదారులు మాత్రం దీనిపై నిరసనలకు దిగుతున్నారు. పలు చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతున్న వారిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.

పరస్పర దాడులు

పరస్పర దాడులు

అంబేద్కర్ జిల్లా పేరును కోనసీమకు పెట్టడాన్ని స్వాగతిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహిస్తుండటం, అవి కాస్తా ఉద్రిక్తతలకు వేదికవుతుండటంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల ఇలాంటి వివాదాలు పెరుగుతుండటం, ఇవి దాడులకు కూడా దారితీస్తుండటంతో పోలీసులు చేసేది లేక 144 సెక్షన్ విధించారు. ఇవాళ్టి నుంచి 144 సెక్షన్ అమల్లోకి రావడంతో పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు.

జగన్ తగ్గేదేలే !

జగన్ తగ్గేదేలే !

కోనసీమ జిల్లా పేరుకు అంబేద్కర్ పేరు కలపడంపై నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గరాదని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలో కాపులు వర్సెస్ ఎస్సీల మధ్య తగాదాలు ఉన్నప్పటికీ జిల్లా పేరు విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని వైసీపీ అధిష్టానం కూడా తమ నేతలకు సూచిస్తోంది. జిల్లా పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అంతిమంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మెజారిటీ వర్గాల నుంచి సానుకూల స్పందన రావడంతో సర్కార్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తోంది.

English summary
police have imposed 144 section in br ambedkar konaseema district from today amid protests against name change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X