ప్రత్యేక హోదా, ప్యాకేజీ: చంద్రబాబుతో భేటీలో మోడీ తేల్చేస్తారా?

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జరిపే భేటీపై ఉత్కంఠ చోటు చేసుకుంది. రేపు మంగళవారంనాడు నరేంద్ర మోడీతో చంద్రబాబు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయాలపై చంద్రబాబు మోడీతో మాట్లాడనున్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం మోడీ ముందుకు వస్తారా, లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది.

ఎపికి ప్రత్యేక హోదా రాదనే విషయం దాదాపుగా స్పష్టమైపోయింది. అయితే, దానికి తగినట్లుగా కేంద్రం ఎపికి భారీ ప్యాకేజీ ఇవ్వవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనం కన్నా రెండింతలు ప్రయోజనం కలిగే విధంగా కేంద్రం ప్యాకేజీ ఇస్తుందని బిజెపి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిబాబు ఒకటికి రెండు సార్లు చెప్పారు.

హరిబాబు చెప్పినట్లు ఆ ప్యాకేజీ భారీగా ఉండి, ప్రత్యేక హోదాను వదులుకోవడానికి అనుగుణంగా ఉంటుందా, అది ఎపి ప్రజలను సంతృప్తి పరుస్తుందా అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకుంటారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రత్యేక హోదాను వదులుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగకుండా ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్యాకేజీతో కాదు, ప్రత్యేక హోదా ఎజెండాతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.

Tension on special status: Chandrababu to meet Modi tommorrow

ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని సినీ నటుడు శివాజీ చాలా అంటున్నారు. దానిపై జనసేన పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 29వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

ప్రత్యేక హోదాపై, ప్యాకేజీపై చంద్రబాబు మోడీతో మాట్లాడేంత వరకు ఆగుతామని, తమకు ప్రాంతాలకు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష ఆదోళనకు దిగుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి రామకృష్ణ ఇప్పటికే హెచ్చరించారు. ప్రజలకు ఎలా నచ్చజెప్పాలనే విషయంపైనే కాకుండా ప్రతిపక్షాలు చెలరేగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై కూడా చంద్రబాబు ముందస్తు కసరత్తు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు మంగళవారం మోడీతో జరిగే భేటీలో చంద్రబాబు ఏ విషయాలు తేలుస్తారనేదిదానిపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ప్రత్యేక హోదా విషయంలో మోడీతో రాజీ పడ్డారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థితిలో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పలేదని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. కానీ, ప్రత్యేక హోదా అనుమానమేనని తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్వయంగా అన్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కేంద్ర మంత్రి కూడా ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని నర్మగర్భంగా చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక హోదా రాదని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని కుండబద్దలు కొట్టిన జెసి దివాకర్ రెడ్డి ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత కాస్తా మెత్తబడ్డారు. కేంద్రంపై విశ్వాసం కలుగుతోందని, ఎపికి ప్రయోజనం చేకూరే విధంగా చర్యలుంటాయని ఆయన అన్నారు. మొత్తం మీద, చంద్రబాబు భేటీ తర్వాత ఎపి రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయనేదే ఆసక్తికరంగా మారింది.

జగన్ ది రాజకీయా పార్టీ కాదు, దివాళా తీసిన పార్టీ ఢిల్లీలో ధర్నా చేసన జగన్ తిట్టాల్సింది మోడీనా, రాహుల్ నా ప్యాకేడీకి కాదు, ప్రత్యేక హోదాతోనే ఢిల్లీ వెళ్లాలి నాతో సహా వైసిపిలో చేరుతున్నరనేది అవాస్తవం అపోహలు, వాస్తవాలు, లాభాలు పేరుతో ఇంటింటికీ కరపత్రాలు పంచుతాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+