జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తేతలి, పలువురు నేతలు
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే చేరారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి సహా పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీలో చేరిన వారిని.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.

వైయస్సార్ తనయుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రామారెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు వైయస్సార్‌సీపీలో చేరారు. కాగా, వైయస్ జగన్ యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications