తుంగలో తొక్కింది: కేంద్రంపై టిజీ వెంకటేష్ ధ్వజం, కెసిఆర్‌పై వ్యాఖ్య
హైదరాబాద్: రాయలసీమ ఐక్య వేదిక ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేధికగా మారిందని రాయలసీమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నేత టీజీ వెంకటేష్ ప్రకటించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం 16న ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. హామీల అమలుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఐక్యవేదికక పోరాటం చేస్తుందన్నారు.

వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇస్తామన్న సిబ్సిడీలు ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఊసేలేదని టీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్యమం వల్లనే విజయం సాధించారని, దీక్ష వల్ల కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications