జగన్ కోట్లు అడుగుతున్నారని జెసి: టిజివిపి హెచ్చరిక
హైదరాబాద్: ఓదార్పు యాత్ర పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వస్తే మానుకోట పునరావృతమవుతుందని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) విద్యార్థులు శనివారం హెచ్చరించారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన జగన్‌కు తెలంగాణ ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు. ఓయులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తే జెండాలు, విగ్రహాలు ధ్వంసం చేస్తామన్నారు.

జగన్ 30 కోట్లు అడుగుతున్నారట: జెసి
జగన్‌కు ఉన్న ధనకాంక్ష ఎవరికీ లేదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వేరుగా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటే ఎంపీ సీటుకు రూ. 30 కోట్లు, ఎమ్మెల్యేల టికెట్‌కు రూ. 5 కోట్లు అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కేవలం డబ్బు మాత్రమే పనిచేయదని, అభ్యర్థుల గుణగణాలు,సామర్థ్యం ముఖ్యమని చెప్పారు.
పిచ్చామె చేతిలోనే అధికారం ఉందని, ఆమె ఎటువైపు రాయి విసిరితే అక్కడే రాజధాని అని, రాయి ఎక్కడ విసురుతుందో తెలియదని సోనియాను తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ఇన్నేళ్ల అనుబంధం తెంచుకోవడం బాధగా ఉందని, ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని జెసి తెలిపారు. కాంగ్రెసు ఉంటేనేం, పోతేనేం అనే వారితోనే సమస్య వచ్చిందన్నారు.
తాను పార్టీ మారే విషయంపై మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మారాల్సిన పరిస్థితి తనకు వచ్చిందని ఆయన శనివారం అనంతపురం జిల్లాలో అన్నారు. కాంగ్రెసుతో ఉన్న ఇన్నేళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం కష్టంగానే ఉందని, అయితే తప్పడం లేదని ఆయన అన్నారు. పార్టీలు మారిన ఆనం వంటివారు తన గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, పార్టీలు మారినవారికి తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications