సభలకు, పెళ్లిళ్లకు వచ్చే వారు ఓట్లు వేయరు, వైసిపి లేని అసెంబ్లీ బాగుంది: ఆదినారాయణరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా అసెంబ్లీ సమావేశాలు బాగా సాగుతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగుందన్నారు.

  AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

  టీడీపీని ఢీకొట్టాలంటే, ఓసారి ఓడిపోయావ్ ఐనా: జగన్‌పై బాలకృష్ణ నిప్పులు

  అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సభలు, పెళ్లిళ్లకు వచ్చే జనం ఎన్నికల్లో ఓట్లు వేయరని చెప్పారు. గత సాధారణ ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డిలు భారీగా పెళ్లిళ్లు జరిపారని, ఆ పెళ్లిళ్లకు జనాలు బాగా వచ్చారన్నారు.

  That people should not vote: Adinarayana Reddy

  కానీ ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలకు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. జగన్ పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారన్నారు. ప్రతిపక్షం లేకుంటే అసెంబ్లీ బాగుందని, వైసీపీ వైరస్ లాంటిదని మండిపడ్డారు.

  వైరస్ లేకుంటే ఎంత ప్రశాంతమో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే అంతే ప్రశాంతత ఉంటుందన్నారు. కాగా, వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Minister Adinarayana Reddy on Friday said that people, who attended marriages and public meetings, will not vote.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి