ఆ ట్రాక్ ఇప్పటికీ బ్రిటీషర్లదే.. అద్దె చెల్లిస్తున్న రైల్వేశాఖ
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేకు తాను అద్దె కట్టే ఒక రైల్వే లైను ఉందని తెలుసా?
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేకు తాను అద్దె కట్టే ఒక రైల్వే లైను ఉందని తెలుసా? ఈ లైనుపై రైలు నడిపింనదుకు ఇప్పటికీ బ్రిటీషర్లకు కోటిరూపాయలు కడుతోంది రైల్వేశాఖ. మహారాష్ట్రలోని యావత్మాల్ - ముర్తిజాపూర్ మధ్య ఉన్న రైల్వే లైనును బ్రిటీష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ లైను ఇంకా వారి అధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయకరణ సమయంలో దీన్ని జాతీయం చేయడం రైల్వే శాఖ మరిచిపోయింది. దీంతో అప్పటి నుంచి బ్రిటీషర్లకు కోటిరూపాయలు కడుతూ వస్తోంది రైల్వే.
ప్రస్తుతం ఈ రైల్వే లైను అమరావతి జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణానికి రూ.150 టికెట్ ధర. టికెట్ల విక్రయం, క్యారేజీల నుంచి ఇంజిన్ వేరు చేసేందుకు, సిగ్నలింగ్‌తోపాటు ప్రస్తుతం ఏడుగురు పనిచేస్తున్నారు. నారో గేజ్‌గా ఉన్న యావత్మాల్- ముర్తిజాపుర్ రైల్వే మార్గాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ముందుకురాగా ఇందుకోసం అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రూ.1,500 కోట్లను కేటాయించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా మారిన తర్వాత కూడా అద్దె కడుతుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీన్ని నిర్మించింది బ్రిటీషర్లే అయినప్పటికీ, దేశంలో భాగంగా ఉన్నప్పటికీ చెందుకు చెల్లిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే బ్రిటీషర్లు దేశవ్యాప్తంగా 50వేల కిలోమీటర్లకు పైగా మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన అధీనంలోకి తీసుకున్న భారతీయ రైల్వే సింగిల్ లైను డబ్లింగ్ చేయడం, డీజిల్ తో నడుస్తున్నమార్గాన్ని విద్యుదీకరణ చేయడం వంటివి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 68,043 కిలోమీటర్ల రైల్వే లైను అందుబాటులో ఉంది. రన్నింగ్ ట్రాక్ పొడవు 102,831 కిలోమీటర్లుగా ఉంది. కాలానికి అనుగుణంగా రైల్వేలను అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. తాజాగా వందే భారత్ పేరుతో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఇంజన్లను సొంతంగా అభివృద్ధి చేస్తోంది












Click it and Unblock the Notifications